Aishwarya Rai: ఆ హీరోతో లిప్‌లాక్‌ సీన్‌.. బాగా హర్టయిన ఐశ్వర్యారాయ్‌ ఫ్యాన్స్‌.. ఏకంగా నోటీసులు పంపి మరీ..

|

Sep 11, 2023 | 2:06 PM

నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తరిగిపోని అందం ఆమెది. ఆ మధ్యన కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నా పొన్నియన్‌ సెల్వన్‌-1,2 సినిమాలతో మళ్లీ గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన నందినీ పాత్రకూ అందరూ ఫిదా అయిపోయారు. కాగా గతంలో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. గ్లామరస్‌ పాత్రల్లోనూ ఫ్యాన్స్‌ను అలరించింది

Aishwarya Rai: ఆ హీరోతో లిప్‌లాక్‌ సీన్‌.. బాగా హర్టయిన ఐశ్వర్యారాయ్‌ ఫ్యాన్స్‌.. ఏకంగా నోటీసులు పంపి మరీ..
Aishwarya Rai
Follow us on

నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తరిగిపోని అందం ఆమెది. ఆ మధ్యన కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నా పొన్నియన్‌ సెల్వన్‌-1,2 సినిమాలతో మళ్లీ గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన నందినీ పాత్రకూ అందరూ ఫిదా అయిపోయారు. కాగా గతంలో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. గ్లామరస్‌ పాత్రల్లోనూ ఫ్యాన్స్‌ను అలరించింది. ఇదే సమయంలో కొన్ని వివాదాలు ఎదుర్కొంది. ముఖ్యంగా ‘ధూమ్ 2’ సినిమాలో హృతిక్ రోషన్ తో లిప్ లాక్ విషయంపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించింది ఐశ్వర్యారాయ్‌. ఆశ్చర్యకరంగా హృతిక్‌తో ముద్దు సన్నివేశానికి లీగల్ నోటీసు కూడా అందుకుందట ఈ అందాల తార. 2004లో ‘ధూమ్’ సినిమా విడుదలైంది. జాన్ అబ్రహం ఇందులో హీరోగా నటించారు. అభిషేక్‌ బచ్చన్‌ మరో కీ రోల్‌ పోషించారు. యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా ‘ధూమ్ 2’ సినిమా విడుదలైంది. ఇందులో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా నటించారు. అభిషేక్‌ బచ్చన్‌ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాలో ఎప్పుడూలేనంతగా గ్లామరస్‌గా నటించింది ఐష్‌. అంతేకాదు హృతిక్‌తో కలిసి లీప్‌లాక్‌ సీన్‌లో కూడా నటించింది. దీనిని చూసి చాలామంది అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యరాయ్ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు కొందరు ఫ్యాన్స్‌ ఏకంగా ఐష్‌కు లీగల్‌ నోటీసులు పంపారట.

ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు..

2012లో ఐశ్వర్యరాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ‘ధూమ్ 2’ సినిమా గురించి మాట్లాడింది ‘ సిల్వర్‌ స్క్రీన్‌పై నన్ను ముద్దుపెట్టుకోవడాన్ని ప్రేక్షకులు కూడా సహించరని నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే ధూమ్‌ సినిమాకు ముందు చాలా మంది ఆర్టిస్టులు తెరపై ముద్దులు పెట్టుకున్నారు. అయితే ఇలా తెరపై ముద్దుపెట్టుకుని ఇబ్బంది పడని నటులు, నటీమణుల సంఖ్య చాలా తక్కువ. నేను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. నేను ధూమ్‌ 2 సినిమాలో నటించాను. ఇందులో హృతిక్‌తో కలిసి ఓ లిప్ లాక్ సీన్ చేశాను. అయితే దీనిపై చాలామంది నాకు లీగల్‌ నోటీసులు పంపారు’ ‘ అని ఐష్‌ తెలిపింది. ‘మీరు ఎంతో మందికి మీరు ఆదర్శం. అలాంటప్పుడు ఇలాంటి సీన్ ఎలా చేస్తారు’ అని ఆ నోటీసులో ప్రశ్నించారట. దీనికి బదులుగా ‘నేను నటిని మాత్రమే. నేను నా పని చేస్తున్నాను’ అని ఆన్సర్‌ ఇచ్చిందట ఐష్‌. కాగా హాలీవుడ్ సినిమా చేయాలనేది ఐశ్వర్య కోరిక. ఓ ఇంగ్లిష్ సినిమాలో నటించే ఆఫర్ కూడా వచ్చింది. అయితే కిస్సింగ్ సీన్, కిస్సింగ్ సీన్ చేయడం అసౌకర్యంగా ఉంటుందటూ చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేసిందట. ఇటీవల విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ నటించింది. విక్రమ్‌, కార్తీ, జయం రవి లాంటి స్టార్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఇప్పటి వరకు కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..