Tollywood: సిగరెట్లకు బానిసైన హీరోయిన్.. ఆ సినిమా తర్వాత రోజుకు ఎన్ని అంటే..

|

Apr 26, 2024 | 12:52 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన కెరీర్ లో ఓ సినిమాలోని సీన్ కోసం తాగిన సిగరేట్ వ్యసనంగా మారిందని.. ఆ అలవాటును చాలాకాలం పాటు విడిచిపెట్టలేకపోయానని తెలిపింది. దివంగత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో 'ది డర్టీ పిక్చర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Tollywood: సిగరెట్లకు బానిసైన హీరోయిన్.. ఆ సినిమా తర్వాత రోజుకు ఎన్ని అంటే..
Heroine
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటుంది. గత కొన్ని రోజులుగా ‘దో ఔర్ దో ప్యార్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన కెరీర్ లో ఓ సినిమాలోని సీన్ కోసం తాగిన సిగరేట్ వ్యసనంగా మారిందని.. ఆ అలవాటును చాలాకాలం పాటు విడిచిపెట్టలేకపోయానని తెలిపింది. దివంగత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో దివంగత నటి సిల్క్ స్మిత పాత్రను పోషించింది విద్యాబాలన్. ఆ పాత్రలో నటించేందుకు విద్యాబాలన్ సినిమాలో సిగరెట్ తాగాల్సి వచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత కూడా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంది. నెమ్మదిగా ఆమె సిగరెట్ వాసనను ఇష్టపడటం ప్రారంభించింది.

విద్యాబాలన్ మాట్లాడుతూ.. “ది డర్టీ పిక్చర్ సినిమాకు ముందు నేను పొగతాగేదానిని కాదు.. సిగరెట్ ఎలా తాగాలి అని తెలుసు కానీ.. ఎప్పుడూ దానిని ముట్టుకోలేదు. కానీ కొన్ని సందర్భాల్లో పాత్రలు, సినిమా న్యాచురల్ గా రావాలంటే కొన్ని పనులు చేయాల్సిందే. అందుకే పాత్ర కోసం సిగరెట్ తాగాను. సిగరెట్ తాగే అమ్మాయిల గురించి ప్రజలు తమ మనస్సులలో ఏమని ఆలోచిస్తారు.. ఎలాంటి ఓపెనియన్ ఏర్పర్చుకుంటారు అనేది నాకు తెలుసు. అందుకే మొదట్లో సిగరేట్ పట్టుకోవాలంటే అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు గతంలోలా ఎవరూ తీర్పు చెప్పరు. ది డర్టీ పిక్చర్ సినిమా నన్ను సిగరెట్ తాగే అలవాటుకు దగ్గర చేసింది. నేను రోజుకు 2 నుండి 3 సిగరెట్లు తాగేదానిని” అంటూ చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇప్పటికీ ఇంకా సిగరెట్ తాగుతున్నారా? అనే ప్రశ్నకు విద్యా మాట్లాడుతూ.. ‘కెమెరా ముందు దీని గురించి మాట్లాడాలని నేను అనుకోను. కానీ సిగరెట్ తాగడం నాకు చాలా ఇష్టం. సిగరెట్ తాగడం వల్ల నష్టమేమీ లేదని మీరు చెప్పి ఉంటే ఇప్పుడు నేను సిగరెట్ తాగేదానిని. నాకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టం. కాలేజీలో కూడా నాకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టం. బస్టాప్‌లో పొగతాగే వ్యక్తి పక్కనే నిల్చొని సిగరెట్ వాసన ఆస్వాదించేదానిని” అని అన్నారు.