బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో రాజ్ కుంద్రాపై పలువురు తారలు తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త అరెస్ట్ అనంతరం చాలా రోజుల వరకు శిల్పాశెట్టి మీడియాకు దూరంగా ఉండిపోయారు. రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులు పోలీసులు శిల్పాను కూడా విచారించారు. ఇటీవలే శిల్పా శెట్టి తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గోంటుంది. అయితే ఇప్పటివరకు శిల్పా తన భర్త అరెస్ట్ గురించి కానీ.. అశ్లీల చిత్రాల ఆరోపణలపైన కానీ మీడియా ముందు మాట్లాడలేదు. కానీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్టులు పెడుతూ వచ్చింది. ఇటీవల తను చేసింది తప్పే అంటూ శిల్పా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శిల్పా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శిల్పా శెట్టి తన భర్తకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే శిల్పా షేర్ చేసిన పోస్టులతో రాజ్ కుంద్రా నుంచి తను దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా ఇతరులను బాధించేలా ఉండకూడదు అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేసింది శిల్పా. అంతేకాకుండా.. తప్పు చేశాను.. కానీ వాటిని సరిదిద్దుకుంటాను అనే స్టిక్కర్ జతచేసింది. దీంతో శిల్పా వ్యవహారంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. రాజ్ కుంద్రాను పెళ్లాడడమే తను చేసిన తప్పు అని.. ఇప్పుడు తన పిల్లలతో కలిసి అతనికి దూరంగా జీవించాలనుకుంటున్నట్లుగా శిల్పా నిర్ణయం తీసుకుందని టాక్ నడుస్తోంది. రాజ్ కుంద్రా వలన శిల్పా శెట్టి పరువు, కుటుంబ పరువు పూర్తిగా పోయిందని.. దీంతో అతడితో ఇక కొనసాగే ఆలోచనలో శిల్పా లేదని బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
Renu Desai: రేణు లంచ్ చేస్తుంటే అకీరా, ఆద్యాల చిలిపి పనులు.. వైరల్‌గా మారిన లేటెస్ట్ పోస్ట్.