బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్ (Alia Bhatt).. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి ఇళ్లు ఎంతో అందంగా ముస్తాబు కాగా.. అతిథుల హంగామా షూరు అయ్యింది. అయితే ముందుగా వీరి పెళ్లి వేడుక ఏప్రిల్ 20న జరగనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరి వివాహం ఈరోజు (ఏప్రిల్ 14న) జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేవలం కొద్ది మంతి అతిథులు, సన్నిహితుల మధ్య మాత్రమే వీరి వివాహం జరుగుతుంది. అయితే నిన్న ఆలియా ఇంట్లో మెహందీ వేడుకలను ఘనంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలకు రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్, హీరోయిన్ కరిష్మా కపూర్ కుటుంబసభ్యులు హజరయ్యారు. వేడుక అనంతరం వీరిద్దరు మెహందీ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకున్నారు.
కరిష్మా కపూర్ తన కాళ్లకు వేసుకున్న మెహందీ ఫోటోలను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయగా.. రిద్ధిమా కపూర్ తన చేతికి వేసుకున్న మెహందీ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా.. మెహందీ వేడుకల అనంతరం రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్.. సోదరి రిద్ధిమ కపూర్ మీడియా ముందుకు వచ్చారు. ఏప్రిల్ 14నే ఆలియా, రణబీర్ కపూర్ వివాహం జరుగుతుందంటూ చెప్పేశారు. అంతేకాకుండా…పెళ్లికూతురిగా ఆలియా ఎంతో క్యూట్ గా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ 2017లో బ్రహ్మస్త్ర షూటింగ్ సమయంలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమగా మారింది. 2018లో ఈ విషయాన్ని అధికారింగా అంగీకరించారు ఈ జంట. అంతేకాకుండా.. 2020లో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉందని.. కానీ కరోనా కారణంగా వాయిదా పడినట్లు గతంలో రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.
Also Read: Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..
Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..
James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..
KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..