Jahnvi Kapoor: ఆ ఇద్దరు హీరోలపై మనసు పడిన జాన్వీ కపూర్… జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఆ హీరో కూడా..

|

Dec 28, 2022 | 1:45 PM

తారక్.. కొరటాల శివ ప్రాజెక్టు లో జాన్వీ నటించనుందని.. ఈ సినిమాతోనే తెలుగు తెరకు జాన్వీ పరిచయం కాబోతుందని టాక్ నడిచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సౌత్ లో మరో హీరో కూడా ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది.

Jahnvi Kapoor: ఆ ఇద్దరు హీరోలపై మనసు పడిన జాన్వీ కపూర్... జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఆ హీరో కూడా..
Jahnvi Kapoor
Follow us on

చిత్రపరిశ్రమలోని అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతుంది. ధడక్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎంచుకుంటూ నటనపరంగా ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి నటనతో అదరగొట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాది పై మనసు పారేసుకుంది జాన్వీ. తనకు సౌత్ లో సినిమాలు చేయాలని ఉందని.. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో తారక్.. కొరటాల శివ ప్రాజెక్టు లో జాన్వీ నటించనుందని.. ఈ సినిమాతోనే తెలుగు తెరకు జాన్వీ పరిచయం కాబోతుందని టాక్ నడిచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సౌత్ లో మరో హీరో కూడా ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది.

ఇటీవల జాన్వీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తను ఫ్యాన్ గర్ల్ అని.. తారక్ నటనకు వీరాభిమానని తెలిపింది. అలాగే కాంతార సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టికి ఫ్యాన్ అయిపోయానని.. చివరి 30 నిమిషాల్లో తన పెర్ఫామెన్స్ చాలా ప్రత్యేకంగా ఉందని ప్రశంసించింది. ఈ రీజనల్ స్టోరీ అక్కడి స్థానికుల ఆచారలకు సంబంధించినదే కానీ అందరికీ కనెక్ట్ అయిందని తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇక తెలుగులో తనకు ఎవరితో పనిచేయాలని ఉందని.. మరోసారి ప్రశ్నిస్తే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తారక్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కథానాయికగా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత తారక్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.