అమ్మతో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఈ క్యూట్‌ బేబీ ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. వరల్డ్‌ వైడ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌

వరుస సినిమాలతో బిజీగా ఉండగానే ఓ పెద్దింటికి కోడలిగా వెళ్లిపోయిన ఈ సొగసరి తాజాగా ఓ లెజెండరీ డైరెక్టర్‌ చిత్రంలో కనిపించి మెప్పించింది. ఇప్పటికీ అదే అందం, అభినయం.. ఆమె వయసుతో పాటు అందమూ పెరుగుతోందని అభిమానులు మురిసిపోతున్నారు.

అమ్మతో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఈ క్యూట్‌ బేబీ ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. వరల్డ్‌ వైడ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌
Actress

Updated on: Nov 01, 2022 | 9:43 AM

పై ఫొటోలో తల్లి ఒడిలో కూర్చొని బర్త్‌ డే కేక్‌ కట్‌ చేస్తోన్న ఈ చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌. పిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో వరల్డ్‌ వైడ్‌ క్రేజ్‌ సొంతం చేసుకుందీ. అందాల పోటీలకు సంబంధించి విశ్వ వేదికపై మన దేశం పేరు మార్మోగేలా చేసింది. ముఖ్యంగా ఈ బ్యూటీక్వీన్‌ కళ్లకు బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌. వరుస సినిమాలతో బిజీగా ఉండగానే ఓ పెద్దింటికి కోడలిగా వెళ్లిపోయిన ఈ సొగసరి తాజాగా ఓ లెజెండరీ డైరెక్టర్‌ చిత్రంలో కనిపించి మెప్పించింది. ఇప్పటికీ అదే అందం, అభినయం.. ఆమె వయసుతో పాటు అందమూ పెరుగుతోందని అభిమానులు మురిసిపోతున్నారు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నప్పటికీ అందం, అభినయంలో మహారాణిగా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ క్వీన్‌ మరెవరో కాదు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌.

మంగళూరు టు ముంబై..

కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది ఐశ్వర్య. ఆతర్వాత మోడలింగ్‌ కోసం ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడింది. పిన్న వయసులోనే మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించి ఇరువర్‌ (తెలుగులో ఇద్దరు) సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌కు పరిచయమైంది. ఆతర్వాత హమ్‌ దిల్‌ దే చుకే సనమ్, దేవదాస్‌, తాల్‌, జోధా అక్బర్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జ్యూరీగా గౌరవం పొందిన ఏకైక భారతీయ హీరోయిన్‌ ఐశ్వర్య. అభిషేక్ బచ్చన్‌ ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ సొగసరి అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. అలా నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో నటించి మెప్పించింది. మళ్లీ సినిమాల్లో బిజీగా మారుతోన్న ఈ అందాల తార నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. మరి మనం కూడా ఈ బ్యూటీ క్వీన్‌కు బర్త్‌ డే విషెస్ చెబుదాం.

హ్యాపీ బర్త్ డే ఐశ్వర్య..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..