Salman Khan: చంపేస్తామని సల్మాన్‏కు బెదిరింపు లేఖ.. రక్షణ కోసం హీరోకు లైసెన్స్ గన్ కావాలంట..

|

Jul 23, 2022 | 11:41 AM

తన స్వీయ రక్షణ కోసం లైసెన్స్ గన్ కోరుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు ఇచ్చారు. మే 29న పంజాబ్ లోని మాన్సా జి్లాలో సింగర్ సిద్ధు మూస్ వాలాను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

Salman Khan: చంపేస్తామని సల్మాన్‏కు బెదిరింపు లేఖ.. రక్షణ కోసం హీరోకు లైసెన్స్ గన్ కావాలంట..
Salman Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు (Salman Khan) చంపేస్తామని బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్‏ అలర్ట్ అయ్యాడు. గత నెలలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బి ష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‏ను చంపెస్తామని బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ క్రమంలోని తాజాగా తనకు ప్రాణాహాని ఉందని.. స్వీయ రక్షణ కోసం లైసెన్స్ గన్ కావాలని ముంభై పోలీసులకు సల్మాన్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు.. తన తండ్రికి బెదిరింపు లేఖలు రావడంపై సల్మాన్ ఈరోజు ముంభై సీపీ వివేక్ ఫన్సల్కర్ ను కలిశారు.

తన స్వీయ రక్షణ కోసం లైసెన్స్ గన్ కోరుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు ఇచ్చారు. మే 29న పంజాబ్ లోని మాన్సా జి్లాలో సింగర్ సిద్ధు మూస్ వాలాను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు (జూన్ 5న) సల్మాన్, అతని తండ్రిని చంపుతామని బెదిరింపులు లేఖ వచ్చింది. దీంతో ఆయన ఇంటి వద్ధ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సింగర్ సిద్దూ పరిస్థితే సల్మాన్ కు వస్తుందని లేఖలో పేర్కోన్నారు బిష్ణోయ్ గ్యాంగ్. బడా వ్యాపారులు, నటీనటుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఈ ముఠా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని… ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచినట్లు మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సల్మాన్ కు వచ్చిన బెదిరింపు లేఖపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.