బిజినెస్‌లోకి చేరిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా.. ‘ఎడ్ ఏ మమ్మా’ పేరుతో కిడ్స్ క్లాత్ స్టోర్ ప్రారంభం..

|

Nov 28, 2020 | 3:43 PM

చిత్ర పరిశ్రమలో జయాపజయాలను తట్టుకొని నిలబడాలంటే హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుకోవాలి. అప్పుడే వారికి ఇండస్ట్రీలో సరైన గుర్తింపు ఉంటుంది.

బిజినెస్‌లోకి చేరిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా.. ఎడ్ ఏ మమ్మా పేరుతో కిడ్స్ క్లాత్ స్టోర్ ప్రారంభం..
Follow us on

చిత్ర పరిశ్రమలో జయాపజయాలను తట్టుకొని నిలబడాలంటే హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుకోవాలి. అప్పుడే వారికి ఇండస్ట్రీలో సరైన గుర్తింపు ఉంటుంది. అందుకే వారు సైడ్ బిజినెస్‌లు ప్రారంభిస్తారు. కార్పొరేట్ యాడ్స్ చేస్తారు. రెండు చేతులా సంపాదిస్తారు. ఎందుకంటే ఒకదాంట్లో నష్టం వచ్చినా ఆ ప్రభావం తనపై పడకుండా మరో బిజినెస్ కాపాడుతుంది. ఇలా రెండింటిని సమ పాళ్లలో మెయింటెన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుందేమో బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్. సినిమాల నుంచి వచ్చే డబ్బులు సరిపోతున్నాయో లేదో అందుకే కిట్స్ రెడిమెడ్ షోరూం ప్రారంభించి క్లాత్ బిజినెస్‌లోకి చేరింది. ‘ఎడ్ ఏ మమ్మా’ పేరుతో షాప్ నిర్వహిస్తోంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కూడా ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. సల్మాన్ చాలా సంవత్సరాల నుంచి బిజినెస్‌ చేస్తున్నాడు. ఈ విషయంలో తెలుగు నటులు కూడా తక్కువేం కాదు. టాప్ హీరోలు దగ్గుపాటి రానా, సూపర్ స్టార్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్, మంచు విష్ణు, మనోజ్, రామ్ చరణ్, సమంత, నాగ చైతన్య పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. ఇక అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఏకంగా రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తులు విక్రయిస్తున్నాడు.