విజయ్ ‘మాస్టర్’ లుక్ నా ఫొటోషూట్ కాపీ.. ‘బిగ్‌బాస్’ బ్యూటీ ఆరోపణలు..!

| Edited By:

Mar 18, 2020 | 9:09 AM

దళపతి విజయ్‌పై వివాదాస్పద నటి, బిగ్‌బాస్ బ్యూటీ మీరా మిధున్ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

విజయ్ మాస్టర్ లుక్ నా ఫొటోషూట్ కాపీ.. బిగ్‌బాస్ బ్యూటీ ఆరోపణలు..!
Follow us on

దళపతి విజయ్‌పై వివాదాస్పద నటి, బిగ్‌బాస్ బ్యూటీ మీరా మిధున్ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల రెండో లుక్‌ను విడుదల చేశారు. ఆ లుక్‌లో విజయ ‘ష్..!’ అన్నట్లుగా ఉండగా.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన మీరా మిథున్ ఇది నా ఫొటో కాపీ నంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు డిసెంబర్ 2019లో తాను అదే ఫోజ్‌తో తీసుకున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. అయితే దీనిపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరా మిధున్‌కు పనిలేకనే ఇలాంటి కల్లిబొల్లి కబుర్లు చెబుతుందంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

కాగా విజయ్ 64వ చిత్రంగా మాస్టర్ తెరకెక్కింది. ఇందులో ఆండ్రియా, మాలవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌గా కనిపిస్తున్నారు. గ్జవియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మామూలుగా ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల మే 21కు వాయిదా పడింది. కాగా ఈ మూవీపై అటు విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా వైరస్: కాజల్ ఎమోషనల్ పోస్ట్.. మేము సైతం అంటోన్న నెటిజన్లు..!