Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు అతిలోక సుందరి కూతురు ఓకే చెప్పిందా..?

|

Jan 03, 2021 | 5:27 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ త్వరలో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు అతిలోక సుందరి కూతురు ఓకే చెప్పిందా..?
Follow us on

Bellamkonda Sreenivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ త్వరలో ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సోనూసూద్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఛత్రపతి’ని అక్కడ రీమేక్ చేయబోతున్నాడు ఈ కుర్రహీరో. ఇక ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్  ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ స్టార్ కిడ్ ను అనుకుంటున్నారట. ఆ అమ్మడు ఎవరో కాదు.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ అమ్మడు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాన్వీని దర్శకనిర్మాతలు సంప్రదించారని టాక్. భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో పాటు ఈ సినిమా  తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో జాన్వీ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో చూడాలి.

also read : Pawan Kalyan : ప్రొడక్షన్ హౌస్‌లలో పెట్టుబడులు పెట్టనున్న పవర్ స్టార్..? ఫిలింనగర్ టాక్