
బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ 70 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్ పట్ల చూపుతున్న నిబద్ధత నేటి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా జిమ్ వర్కౌట్స్, బ్యాక్ ఎక్సర్‌సైజెస్, ట్రెడ్‌మిల్ సెషన్స్ షేర్ చేస్తూ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అనే మాటని చేతల్లో చూపిస్తున్నారు అనుపమ్ ఖేర్.
ఇటీవల అనుపమ్ పోస్ట్ చేసిన వీడియోలో వెయిటెడ్ పుల్-డౌన్స్, ల్యాట్ పుల్-డౌన్స్ వంటి హెవీ రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజెస్ చేస్తూ టోన్డ్ బ్యాక్ మసిల్స్‌ను ప్రదర్శించారు. ‘70కి కూడా #PosterBoy అవ్వొచ్చు! నీ బలం నీకు తెలియాలంటే సవాళ్లను ఎదుర్కోవాలి’ అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. మరో పోస్ట్‌లో ‘పడటం మేలు… ఎప్పుడూ ట్రై చేయకపోవడం కంటే’ అని రాసి, లైఫ్‌లోనూ ఫిట్‌నెస్‌లోనూ ఎడతెరపి లేకుండా ప్రయత్నించాలనే సందేశం అందించారు.
Anupam Kher
రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్.. బ్యాక్, షోల్డర్స్, కోర్ మసిల్స్‌ను టార్గెట్ చేసే ఎక్సర్‌సైజెస్. పాజిటివ్ మైండ్‌సెట్.. ‘జై భజరంగబళి’వంటి మంత్రాలతో మానసికంగా బలోపేతం అవడం. 70 ఏళ్ల వయసులో ఇంత తీవ్రమైన వర్కౌట్స్ చేయడం అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వానికి నిదర్శనం. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తిగా, జీవితంలోని పతనాల నుంచి లేచి నిలబడటమే నిజమైన బలమని ఆయన నమ్ముతారు.
ఈ సిద్ధాంతాన్ని ఫిట్‌నెస్‌లో అమలు చేస్తూ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు. వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. మీరు ఎప్పుడు మొదలు పెట్టినా, ఎంత తడబడినా… మళ్లీ లేచి ప్రయత్నిస్తే చాలు. ఆ ఒక్క అడుగు మిమ్మల్ని ఎప్పటికీ యంగ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంచుతుంది అనేది అనుపమ్ సిద్ధాంతం!