మహేష్‌కి విలన్‌గా అనిల్‌కపూర్‌!

సరిలేరు నీకెవ్వరుతో ఈ ఏడాది మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించేందుకు రెడీ అవుతున్నారు

మహేష్‌కి విలన్‌గా అనిల్‌కపూర్‌!

Updated on: Sep 06, 2020 | 2:19 PM

Sarkaru Vaari Paata: సరిలేరు నీకెవ్వరుతో ఈ ఏడాది మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

అదేంటంటే ఇందులో విలన్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్ కపూర్ పేరు వినిపిస్తోంది.  ఇటీవల అనిల్‌ని కలిసిన పరశురామ్‌ సర్కారు వారి పాట స్క్రిప్ట్‌ని చెప్పారని, అందులో విలన్ పాత్ర ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం అనిల్ డేట్లు ఇవ్వనున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌ ప్రేక్షకులు మరో క్రేజీ కాంబోను థియేటర్లలో చూడనున్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్‌ సరసన మొదటిసారి కీర్తి సురేష్ జతకట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీపై అటు మహేష్ అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

Bigg Boss 4: లిస్ట్‌ ఫైనల్‌.. హౌజ్‌లోకి వెళ్లేది వీరే

ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us