వారితో ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందని చెబుతున్న ఫైటర్ భామ.. తన క్యారెక్టర్ బాగా నచ్చిందని కితాబు..

|

Nov 28, 2020 | 12:56 PM

విజయ్ దేవరకొండతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందని చెబుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫైటర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

వారితో ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందని చెబుతున్న ఫైటర్ భామ.. తన క్యారెక్టర్ బాగా నచ్చిందని కితాబు..
Follow us on

విజయ్ దేవరకొండతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందని చెబుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫైటర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల చిత్ర షూటింగ్ ఆగిపోగా ఇటీవల మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ అనన్య ఇటీవల మీడియాతో పంచుకున్నారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అనన్య యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా షూటింగ్ గురిచి మాట్లాడుతూ ఇది ఒక విభిన్న ప్రపంచమని, విజయ్, పూరీతో వర్క్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుందని చెప్పింది. వీరి దగ్గరి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. పైటర్ చిత్రంలోని క్యారెక్ట‌ర్ తనకు బాగా నచ్చిందని, హీరోయిన్‌గా తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందని వెల్లడిచ్చింది. ఇటీవల తెలుగులో కొన్ని మాటలు కూడా నేర్చుకున్నానని, త్వరలోనే మాట్లాడతానని తెలిపింది. అలాగే దీపికాపదుకొనె, సిద్దార్ధ్ చతుర్వేదితో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందని త్వరలోనే వారందరి నమ్మకాలను నిలబెడతానని తెలిపింది.