Anand Mahindra: సర్కార్ వారి పాటలో మహేశ్ బాబు ఆ లుక్కుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్.. ఎమన్నారంటే..

Anand Mahindra: దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం ఆయన చేసిన ట్వీట్ ఇంతకుముందు వాటి కంటే కొంత భిన్నంగా ఉంది.

Anand Mahindra: సర్కార్ వారి పాటలో మహేశ్ బాబు ఆ లుక్కుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్.. ఎమన్నారంటే..
Anand Mahindra

Updated on: May 30, 2022 | 8:51 AM

Anand Mahindra: దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం ఆయన చేసిన ట్వీట్ ఇంతకుముందు వాటి కంటే కొంత భిన్నంగా ఉంది. తరచుగా సామాజిక సమస్యలపై ట్వీట్లు చేసే ఆయన ఈసారి ప్రముఖ సౌత్ ఇండియన్ నటుడు మహేష్ బాబు గురించి ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో, జావాపై మహేష్ బాబు రైడ్ గురించి ప్రస్తావించారు మహీంద్రా.

ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో ‘మహేష్ బాబు జావా అద్భుతమైన కాంబినేషన్‌ని చూడకుండా ఎలా ఉండగలను? ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. త్వరలో షూటింగ్ జరుగుతున్న న్యూజెర్సీకి వెళతానని అన్నారు. మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ నుంచి లైక్‌లు, రీట్వీట్స్ వస్తున్నాయి.

ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్న జావా మోటార్‌సైకిల్ నిజానికి మహీంద్రా & మహీంద్రా బ్రాండ్ బైక్. దాదాపు 44 ఏళ్ల తర్వాత.. కొన్ని సంవత్సరాల తరువాత ఈ బైక్ ఇండియాకు వచ్చింది. ఇప్పుడు జావా మోటార్‌సైకిళ్లు మహీంద్రా & మహీంద్రా కంపెనీకి అనుబంధంగా ఉన్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అమ్మకాలు జరుగుతున్నాయి.