ఆ సినిమాలో నిజమైన బుల్లెట్లను వాడారు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన అమితాబ్.. ఇంతకీ ఏంటా చిత్రం ?..

అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ అటు సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన ప్రతీభను చూపిస్తున్నారు. బిగ్ బి వ్యాఖ్యతగా వ్యవహిస్తున్న కౌన్ బనేనా కరోడ్ పతి షోకు ప్రేక్షకులలో ఉన్న

ఆ సినిమాలో నిజమైన బుల్లెట్లను వాడారు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన అమితాబ్.. ఇంతకీ ఏంటా చిత్రం ?..

Updated on: Dec 26, 2020 | 3:02 PM

అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ అటు సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన ప్రతీభను చూపిస్తున్నారు. బిగ్ బి వ్యాఖ్యతగా వ్యవహిస్తున్న కౌన్ బనేనా కరోడ్ పతి షోకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి వీడిగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ఈ షోలో పాల్గొని బిగ్ బి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకొని వెళ్తుంటారు. ఈ సందర్భంగా కౌన్ బనేనా కరోడ్ పతి వేదికగా అమితాబ్ తన కెరిర్‏లోనే సూపర్ హిట్ సాధించిన షోలే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన చిత్రం షోలే. ఇటీవలే ఈ సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తయ్యాయి. కాగా ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిఐజీ ప్రీత్ మోహన్ భార్య సత్వీందర్ కౌన్ పాల్గొన్నారు. మీ షోలే సినిమాకు మా ఆయన వీరాభిమాని అని ఆమె చెప్పగా.. ఆ సినిమా షూటింగ్‏కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అమితాబ్ బయటపెట్టారు. షోలే చిత్రీకరణ సమయంలో క్లైమాక్స్‏లో ఓ సన్నివేశానికి ధర్మేంద్ర చాలా టేక్‏లు తీసుకున్నారు. దీంతో ఆయనకు చాలా చిరాకు వచ్చింది. వెంటనే ఓ బాక్సులో ఉన్న బుల్లెట్లు తీసుకుని తుపాకీలో లోడ్ చేసి షూట్ చేయగా, ఒక బుల్లెట్ నా చెవి పక్కనుంచే వెళ్ళింది. ఆ సన్నివేశానికి రెండు, మూడు టేకులు తీసుకున్నారు. కానీ అనుకోకుండా తుపాకీలోని బుల్లెట్లు పేలడంతో ఆయన షాక్ అయ్యారు. ఆ సమయంలో నేను దూరంగా ఓ కొండపై నిల్చోని ఉన్నాను. అదృష్టశాత్తూ నాకేమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అని అమితాబ్ చెప్పారు.