Raaka Movie: సోషల్ మీడియాను ఊపేస్తున్న రాకా అప్డేట్.. ఆసక్తి రేపుతున్న కొత్త పోస్టర్..

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా.. కొన్నాళ్లుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Raaka Movie: సోషల్ మీడియాను ఊపేస్తున్న రాకా అప్డేట్.. ఆసక్తి రేపుతున్న కొత్త పోస్టర్..
Raaka Movie

Updated on: Sep 18, 2026 | 1:41 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’. జవాన్ సినిమా తర్వాత అట్లీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తున్నా క్షణాల్లో వైరలవుతున్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వదిలిన ఓ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ఇతర వివరాలు ఇవ్వకుండా, కేవలం ’37’ అనే నంబర్‌తో ఉన్న ఓ మిస్టరీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు మేకర్స్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

ఈ పోస్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అసలు ఆ ’37’ సంఖ్యకు అర్థం ఏమిటనే దానిపై నెట్టింట రకరకాల ఊహాగానాలు, థియరీలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు ఉండటంతో, ఈ ’37’ వెనుక ఉన్న అసలు రహస్యం అదే రోజు బయటపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అట్లీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

ఈ చిత్రంలో అల్లు అర్జున్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారని, పలువురు స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మిస్టరీ నంబర్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో దీపికాతోపాటు రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

రాకా సినిమా అప్డేట్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us