బందీపోటుగా బన్నీ..?

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:12 PM

అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అల్లు అర్జున్‌తో తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు లెక్కల మాష్టర్ సుకుమార్. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ కూడా చేసుకుంటున్నాడు. అయితే ఈ కథ మహేశ్ కోసం రాసుకున్నదే అని వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. మహేశ్ కోసం థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసిన సుకుమార్.. ఇప్పుడు అదే కథనే బన్నీతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అల్లు […]

బందీపోటుగా బన్నీ..?
Follow us on

అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అల్లు అర్జున్‌తో తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు లెక్కల మాష్టర్ సుకుమార్. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ కూడా చేసుకుంటున్నాడు. అయితే ఈ కథ మహేశ్ కోసం రాసుకున్నదే అని వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. మహేశ్ కోసం థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసిన సుకుమార్.. ఇప్పుడు అదే కథనే బన్నీతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ బందిపోటుగా కనిపించబోతున్నట్లు టాక్.

అయితే రంగస్థలం హిట్ తరువాత మహేశ్‌తో తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సుకుమార్.. అతడి కోసం పలు కథలను రాసుకున్నాడు. వాటిలో ఓ థ్రిల్లర్ కథకు మహేశ్ చేత ఓకే చెప్పించుకున్న సుకుమార్.. పది నెలల నుంచి దానికి సంబంధించిన స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ మహేశ్‌తో ఆగిపోవడంతో ఇప్పుడు అదే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసిన సుకుమార్ , బన్నీతో తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఫేవరెట్ పెయిర్‌గా పేరొందిన బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై అప్పుడే టాలీవుడ్‌లో అంచనాలు మొదలయ్యాయి.