Allu Arjun Trivikram: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్‌లో అల్లు అర్జున్- త్రివిక్రమ్ జోడీ ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో మూవీలు రాగా.. ఆ మూడు మంచి విజయాలను సాధించాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన అల వైకుంఠపురములో అయితే నాన్ బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇలాంటి క్రేజీ కాంబో మరోసారి కలిసి పనిచేయనుందా..? అంటే అవుననే టాక్ నడుస్తోంది ఫిలింనగర్‌లో. అయితే మూవీ కోసం కాదు ఓ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం. ( వైసీపీలో విషాదం.. కాకినాడ నగర అధ్యక్షుడు కన్నుమూత)
తన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాను ప్రమోట్ చేసేందుకు అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా పలు షోలు, వెబ్ సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నారు. సమంత లాంటి స్టార్‌తో ఓ టాక్ షోను కూడా చేయిస్తున్నారు. ఈ షో ఈ నెల 13న ప్రీమియర్ కూడా అవ్వనుంది. కాగా త్వరలో దీపావళి రానుండగా.. అల్లు అర్జున్‌తో ఓ స్పెషల్ ప్లాన్ చేశారట అల్లు అరవింద్. ఓ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్‌ని విడుదల చేయనున్నారట. దీన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారట.( లాక్‌డౌన్‌లో 15 స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసిన రామ్..!)
కాగా మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూవీ కోసం సెట్స్ వేయగా.. ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ జరిగేలా సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ( కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,440 కొత్త కేసులు.. 5 మరణాలు)