Chiranjeevi: చిరు మూవీపై అవన్నీ పుకార్లేనట..!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఆ తరువాత లూసిఫర్‌లో నటించనున్న విషయం తెలిసిందే.

Chiranjeevi: చిరు మూవీపై అవన్నీ పుకార్లేనట..!

Updated on: Jul 17, 2020 | 8:43 AM

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తోన్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఆ తరువాత లూసిఫర్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ రీమేక్‌కు సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు చిరునే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు సుజీత్‌ స్క్రిప్ట్‌ పనుల్లో ఉన్నాడని ఆయన వెల్లడించారు. అయితే ఈ మూవీకి ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన సుజీత్‌ దాన్ని చిరుకు వినిపించగా, అది ఆయనకు నచ్చలేదని ఇటీవల గాసిప్‌లు  వచ్చాయి. దీంతో లూసిఫర్ రీమేక్‌ బాధ్యతలను చిరు, వివి వినాయక్‌కి అప్పగించినట్లు కూడా టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ వట్టి పుకార్లేనని తెలుస్తోంది.

చిరు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ రీమేక్‌కి సుజీత్‌నే దర్శకత్వం వహించబోతున్నారట. ఇక ఇందులో పలు పాత్రలకు జగపతి బాబు, జయసుధ, విజయశాంతి, రెహమాన్, సుహాసిని, ఖుష్బూ పలువురి పేర్లు వినిపించగా.. అవన్నీ కూడా పుకార్లేనని చిరు టీమ్‌ కొట్టివేసిందట. కాగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్  పతాకంపై రామ్ చరణ్ నిర్మించనున్నారు. మలయాళంలో లూసిఫర్ పెద్ద విజయం సాధించగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఇక్కడ పలు మార్పులు ఉండబోతున్నట్లు సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us