ఏనుగు విసర్జితాలతో టీ.. గడగడా తాగేసిన అక్షయ్‌

ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ అడవిలో సాహసాలు చేసిన విషయం తెలిసిందే.

ఏనుగు విసర్జితాలతో టీ.. గడగడా తాగేసిన అక్షయ్‌

Updated on: Aug 31, 2020 | 6:26 PM

Into The Wild With Bear Grylls: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ అడవిలో సాహసాలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11న ఈ ఎపిసోడ్ ప్రీమియర్‌ అవ్వనుండగా.. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో బేర్‌ గ్రిల్స్‌, అక్షయ్ చేసిన మరిన్ని సాహసాలను చూపించారు. ఇక వీడియోలో గ్రిల్స్‌ ఏనుగు విసర్జితాలతో టీ చేయగా.. దాన్ని కిలాడీ తాగేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక దీన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న అక్షయ్‌.. బేర్ గ్రిల్స్‌తో ప్రయాణించేటప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలని నాకు తెలుసు. అయితే ఏనుగు విసర్జితాలతో టీతో బేర్ గ్రిల్స్ నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేశాడు అంటూ రాసుకొచ్చారు. కాగా బేర్ గ్రిల్స్ గతంలో ప్రధాని మోదీ, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సాహసయాత్రలు చేయగా.. వాటికి సంబంధించిన ఎపిసోడ్‌లు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ సాహస యాత్ర ఎపిసోడ్‌ కూడా అంతే విజయం సాధిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Read More:

బాబుకు మరో షాక్‌.. వైసీసీలో చేరిన చలమలశెట్టి

నిజం తెలుసుకోకుండా మమ్మల్ని ట్రోల్‌ చేశారు: కృష్ణుడు

Loading...
Unable to load recommendations.
Follow Us