హైస్పీడ్ వలన ఆరుసార్లు చలానా.. ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టానని ఒప్పుకున్న యంగ్ హీరో..

|

Feb 18, 2021 | 2:46 PM

'క్షణం', 'ఎవరు', 'గూడఛారి' వంటి విభిన్నమైన సినిమాలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. ఆయన సినిమాలు ఎంత విజయాలు సాధించడంతోపాటు..

హైస్పీడ్ వలన ఆరుసార్లు చలానా.. ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టానని ఒప్పుకున్న యంగ్ హీరో..
Follow us on

‘క్షణం’, ‘ఎవరు’, ‘గూడఛారి’ వంటి విభిన్నమైన సినిమాలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. ఆయన సినిమాలు ఎంత విజయాలు సాధించడంతోపాటు.. అతడు చేసే సినిమాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా అడివి శేష్… సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కపటధారి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు హాజరయ్యాడు. ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీసుగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల వలన తన లైఫ్‏లో జరిగిన ఓ అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.

డ్రింక్ అలవాటు లేదు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్‏లో ఎప్పుడూ పట్టు పడలేదు.. కానీ ఆరు సార్లు చలానాలు పడ్డాయని తెలిపాడు. ఓ సారి ఔటర్ రింగ్ రోడ్డులో కారులో వెళ్తుండగా.. పోలీసులు ఆపారట. హై స్పీడ్ వలన అతని కారు పై ఆరు చలానాలు ఉండగా… ట్రాఫిక్ పోలీసులకు ఆ చలానాలు కట్టినట్లుగా తెలిపారు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

Also Read: