థ్రిలర్ అండ్ సస్పెన్స్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‌లో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యుటీ సైఈ మంజ్రేకర్, శోభితా దూళిపాళ్ళ నటిస్తున్నారు. ప్రముఖ జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
డిసెంబర్ 17న హీరో అడవి శేట్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన లుక్ టెస్ట్‌కు భారీగానే స్పందన వచ్చింది. కాగా డిసెంబర్ 17 ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
#MajorBeginnings – After the overwhelming response for ‘The Look’ Test, we’re excited to show you The First Look on 17th Dec @ 10 AM.#MajorTheFilm @AdiviSesh @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @vivekkrishnani @sonypicsprodns pic.twitter.com/E4UvzRasgf
— GMB Entertainment (@GMBents) December 15, 2020