రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతుంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్కులో ఆమె మూడు మొక్కలు నాటారు. అనంతరం తన కోస్టార్స్ రెజీనా, అనుష్క, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు. ప్రగ్యాజైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న ‘బీబీ 3’లో హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో బోయపాటి దర్శకత్వం లో వచ్చిన ‘జయ జానకీ నాయక’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రగ్యాజైశ్వాల్ నటించిన విషయం తెలిసిందే.
also read :
sudigali sudheer movie : సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన జనం.. షూటింగ్ చెయ్యొద్దు అంటూ వార్నింగ్..