
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార పాయల్ రాజ్‌పుత్. ఒకే ఒక సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్‌లో తన నటతనో పాటు అందంతోనూ మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఇక సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పాయల్ తన లేటెస్ట్ ఫొటోలతో నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
పాయల్ రాజ్‌పుత్ చాలా కాలంలో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్నారు. సౌరభ్ యాక్టర్ కమ్ మోడల్ అలాగే నిర్మాత కూడాను. పాయల్ బుల్లి తెరలో నటించిన సమయంలో సౌరభ్ దింగ్రాతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సౌరభ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పాయల్ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. బాయ్ ఫ్రెడ్‌తో దిగిన కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం పాయల్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలతో పాటు ఎమోషనల్ కొటేషన్ రాసుకొచ్చింది పాయల్.
ఈ పోస్టులతో పాటు పాయల్.. ‘గత కొన్నేళ్లుగా నీ జీవితంలో కఠినమైనవి అని తెలుసు. జీవితం అంటే అంతే. కానీ నువ్వు అంతకన్నా టఫ్. నీకు ఆ భగవంతుడు సమస్యలు ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా సంతోషానికి, నవ్వుకు, అందమైన జీవితానికి నీవే కారణం’ అంటూ రాసుకొచ్చింది పాయల్. దీంతో ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్‌ని ఎంతలా లవ్ చేస్తుందో చెప్పకనే చెప్పేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..