Malavika Sharma: రెడ్ మూవీలో రామ్ సరసన నటిస్తున్న మాళవిక శర్మ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుంది. నేలటికెట్ సినిమాలో రవితేజతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తిస్తుంది. కాలేజీ టైంలోనే మోడలింగ్ ప్రారంభించిన మాళవిక కొన్ని టీవీ ఫేమస్ కమర్షియల్ యాడ్స్ హిమాలయ మీరా కోకోనట్ ఆయిల్, సంతూర్ గ్లోయిన్ లాంటి వాటి యాడ్స్‌లో మెరిసి సినిమా అవకాశం దక్కించుకుంది.
ఈ యంగ్ బ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో 8 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అభిమానులు ఆ పోస్టును అలా వైరల్ చేసేస్తారు. ప్రస్తుతం రామ్ తో కలిసి రెడ్ సినిమాలో నటిస్తోందీ ఈ భామ. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ 2021లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటంటే ఈ ఏడాది తాను ఫిట్‌నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అంతేకాదు ఓ ఫిట్‌నెస్ ట్రైనర్, డైటీషియన్‌ను నియమించుకొని బరువు పెరగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. దక్షిణాది ప్రేక్షకులు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను ఎక్కువగా ఇష్టపడతారని వారి కోసం తాను బరువు పెరగాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ భామ.