Krithi Shetty: ‘బేబమ్మ’ మరీ ఎంత ఎమోషన్‌లా.. లైవ్‌లో ఏడ్చేసిన కృతిశెట్టి, వైరల్‌ అవుతోన్న వీడియో..

|

May 30, 2022 | 2:34 PM

Krithi Shetty: 'ఉప్పెన' సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని నటిగా మంచి...

Krithi Shetty: బేబమ్మ మరీ ఎంత ఎమోషన్‌లా.. లైవ్‌లో ఏడ్చేసిన కృతిశెట్టి, వైరల్‌ అవుతోన్న వీడియో..
Follow us on

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత పలు వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో డేరింగ్‌ పాత్రలో నటించిన కృతిశెట్టి, రియల్‌ లైఫ్‌లో మాత్రం చాలా బిడియం అనే విషయం మీకు తెలుసా.? తాజాగా జరిగిన ఓ సంఘటనే దీనికి ప్రత్యక్షసాక్ష్యంగా చెప్పొచ్చు. ఇటీవల కృతిశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లైవ్‌లోనే ఏడ్చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో కృతి ఎంత ఎమోషన్‌లో చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. తాజాగా కృతిశెట్టికి ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న తర్వాత ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు యాంకర్లు కృతిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక యాంకర్‌ మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతుండడం చూసి మరో వ్యక్తి.. ‘ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే.. ఇక నేను ఎందుకిక్కడ? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చొపెట్టారు? ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన దుస్తులు ఎందుకు? ఈ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఎవరు? కెమెరా ఆఫ్‌ చేయండి’ అంటూ హంగామా చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన కృతిశెట్టి కంట నీరు పెట్టుకుంది. దీంతో ఇది గమనించిన యాంకర్లు ఇది ప్రాంక్‌ మాత్రమేనని, కంగారు పడొద్దు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయిన కృతి చిన్న పిల్లలా ఏడ్వడం మొదలు పెట్టింది. వెంటనే టీమ్‌ మొత్తం కృతి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. అనంతరం ఈ విషయమై మాట్లాడిన కృతి.. ‘ఎవరైనా గట్టిగా మాట్లాడితే నాకెంతో భయం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన కృతి ఫ్యాన్స్‌ సదరు యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..