Suriya- Jyothika: కోలీవుడ్‌లో ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ జాబితాలో సూర్య- జ్యోతిక (Suriya- Jyothika) ల జోడి కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతోంది. 2006లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్‌కపుల్‌కు ఇద్దరు పిల్లులు ఉన్నారు. కూతురు పేరు దియా కాగా.. కొడుకు పేరు దేవ్. సూర్య సినిమాల్లో తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తుండగా జ్యోతిక నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది. అయితే వ్యక్తిగతంగా వీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ పిల్లల కోసం తగిన సమయం కేటాయిస్తున్నారు క్యూట్ కపుల్. ఇదిలా ఉంటే
తన కూతురు దియా చదువులో టాపర్ అని, క్లాస్ ఫస్ట్ వస్తుందని సూర్య దంపతులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. ఇటీవల విడుదలైన తమిళనాడు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో దియా టాపర్‌గా నిలిచింది. అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభైకి పైగా మార్కులు సాధించింది. ముఖ్యంగా చాలామంది కష్టంగా భావించే గణితంలో ఆమె వందకు వంద మార్కులు రావడం విశేషం.
లెక్కల్లో వందకు వంద..
ముఖ్యంగా ఎంతో కష్టమైన సబ్జెక్ట్ గణితంలో ఆమె వందకు వందశాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తమిళం, సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లో 95 మార్కులు, సైన్స్‌లో-98, ఇంగ్లిష్‌లో-99, మ్యాథ్స్‌లో-100 మార్కులు తెచ్చుకుంది దియా. ఈక్రమంలో తమ గారాల పట్టి సాధించిన ఘనతను చూసి సూర్య- జ్యోతికలు మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే దియా పదో తరగతి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు సూర్య దంపతులు, దియాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Diya – Daughter of Jothika & Suriya, scored 487/500 in her 10th results.
Tamil – 95. Social Science – 95. Science – 98. English – 99. Maths – 100 –
Source: Polimer News.#10thResult2022#10thresults2022 #Diya #Jyothi#Suriya #jothika https://t.co/hE5t7zBPxJ
— ???????❤️என்றும் சூர்யா ரசிகன்? (@Sathiya1522) June 21, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..