Ram Charan: రామ్‌చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవి మౌనం వీడితే తట్టుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్..

|

Jan 29, 2023 | 9:22 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రాంచరమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ తప్ప..చిరంజీవి జోలికి ఎవరొచ్చినా మేం ఊరుకోం.. అని చెర్రీ చేసిన..

Ram Charan: రామ్‌చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవి మౌనం వీడితే తట్టుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్..
Ram Charan
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ తప్ప..చిరంజీవి జోలికి ఎవరొచ్చినా మేం ఊరుకోం.. అని చెర్రీ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఇంతకీ.. ఈ కామెంట్స్‌ రాంచరణ్‌ ఎందుకు చేశారు..? ఎవరినుద్దేశించి చేశారనే టాక్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తమ్ముడు లాంటి రవితేజ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమన్నాడు కాబట్టి సరిపోయింది. అదే మరొకరు అయ్యుంటే ఏం జరిగింది ఉండేదే అంటూ రాంచరణ్‌ వ్యాఖ్యనించాడు. చిరంజీవిని ఏదైనా అనాలంటే ఫ్యామిలీ అయినా అయ్యుండాలి. ఫ్యాన్స్‌ అయినా అయ్యుండాలి అన్నారు రామ్‌చరణ్‌. వాల్తేరు వీరయ్య సక్సెస్‌మీట్‌లో ఆయన ఈ కామెంట్స్‌ చేశారు. చిరంజీవి సౌమ్యులు కావచ్చు.. మేం కాదు అంటూ ఘాటుగా మాట్లాడారు.

రాంచరణ్‌ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు..? తమ్ముడు పవన్‌కల్యాణ్‌ మాదిరిగానే రవితేజను భావించారు కాబట్టి, ఆ డైలాగ్‌ చెప్పగలిగారని, మిగతారైతే ఏం జరిగి ఉండేదో అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇక వాల్తేరు వీరయ సక్సెస్‌ మీట్‌ విజయంతంగా జరిగింది. మెగా ఆభిమానులతో ఓరుగల్లు ఉప్పొంగింది. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానం కిక్కిరిసిపోయింది. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ వచ్చినప్పుడు అభిమానుల కేరింతలతో మార్మోగింది. ఓరగల్లు ప్రజల ప్రేమ, అభిమానం, ఆప్యాయత మరువలేనిదన్నారు చిరు.

ఇవి కూడా చదవండి

ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఓరుగల్లుపై అడుగుపెట్టినప్పుడు చూపిన ప్రేమ అభిమానం ఇంకా ఉందన్నారు చిరంజీవి. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం, ప్రేమ, వాత్సల్యంతోనే వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి