Babu Mohan : కోట శ్రీనివాస్ రావు చనిపోయినప్పుడు ఆ హీరో చేసిన పనికి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.. బాబూ మోహన్..

టాలీవుడ్ సీనియర్ నటుడు బాబు మోహన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని తలచుకుని కంటతడి పెట్టారు. దర్శక దిగ్గజాలు కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డిలతో తనకున్న అనుబంధం గురించి బాబు మోహన్ ప్రస్తావించారు. తాను నటిస్తున్న సినిమాలలో వాళ్లకు ఎప్పుడూ రెమ్యునరేషన్ అడగలేదని, వారిచ్చిన ప్రోత్సాహమే తనకు ముఖ్యమని తెలిపారు.

Babu Mohan : కోట శ్రీనివాస్ రావు చనిపోయినప్పుడు ఆ హీరో చేసిన పనికి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.. బాబూ మోహన్..
Babu Mohan

Updated on: Nov 12, 2026 | 11:55 AM

ప్రముఖ కమెడియన్, నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆయన.. ఇప్పుడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను, దిగ్గజ నటులతో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సహనటుడు కోట శ్రీనివాసరావు అకస్మిక మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణం తర్వాత పార్థివ దేహం వద్ద తాను చిన్నపిల్లాడిలా ఏడ్చిన క్షణాలను తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావుతో ‘మాయలోడు’ చిత్రంలో కలిసి పనిచేసిన రోజులను, సెట్స్‌లో ఆయన తనకు ఎంతో ఆప్యాయంగా భోజనం తినిపించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అలాగే తాను పవన్ కళ్యాణ్ తో తక్కువ సినిమాలు ఎందుకు చేశారని అడిగినప్పుడు, తనకు సరిపోయే పాత్రలు లేకపోవడం లేదా తన డేట్లు బిజీగా ఉండటం వల్ల కావచ్చు అని చెప్పారు. అయితే, వ్యక్తిగత అనుబంధం చాలా మంచిదని, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే నటుడు కోట శ్రీనివాసరావు మరణించినప్పుడు జరిగిన ఒక హృదయాన్ని కదిలించే సంఘటనను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

ఆ రోజు కోట శ్రీనివాసరావు మరణించినప్పుడు తాను ప్రెస్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. అప్పుడే పవన్ కళ్యాణ్ అక్కడకు వచ్చారని, తాను గమనించకుండానే తన వెనుక వచ్చి నిలబడ్డారని చెప్పారు. తాను మాట్లాడుతుండగా, ముందున్న వారు ఆశ్చర్యంగా చూస్తున్నారని గమనించి వెనక్కి తిరిగి చూశారట. అప్పుడు తన వెనుక పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నారని, “నేను వెయిట్ చేస్తాను. నువ్వు కంటిన్యూ చెయ్,” అని వినయంగా అన్నారని వివరించారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు కూడా తనకు గూస్‌బంప్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

ఒక పెద్ద స్టార్‌గా, అంత వినయంతో, ఓపికగా వ్యవహరించడం పవన్ కళ్యాణ్ గొప్పదనమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తనకి అన్నతో సమానమని, చిరంజీవి అంటే ఎంత ప్రేమనో పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతేనని పేర్కొన్నారు. అయితే, వయసులో చిన్నవాడు కావడం వల్ల చిరంజీవి గారిని ఎప్పుడూ ఎత్తుకున్నంత విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుకోలేదని, అలాంటి సందర్భాలు రాలేదని చెప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు, తాను త్వరగా తన మాటలు ముగించి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళానని, ఇద్దరం కలిసి పరామర్శల్లో పాలుపంచుకున్నామని గుర్తుచేసుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం రాకుండా పక్కన ఉండి లోపలికి పంపి, ఆ తర్వాత తాను బయటకు వచ్చానని వివరించారు. అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

బాబూ మోహన్, పవన్ కళ్యాణ్..

Babu Mohan, Pawan Kayan

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us