
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు బాబ్లూ పృథ్విరాజ్. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు సినీరంగంలోకి బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే యానిమల్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే నటుడిగా, విలన్ పాత్రలతోన ఫేమస్ అయ్యాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, ముఖ్యంగా తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన పెళ్లి సినిమా అనుభవాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో తన నెగెటివ్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగా గుర్తుండిపోయిందో, దాని పారితోషికంతో తాను ఏం కొనుక్కున్నానో ఆయన వివరించారు. పెళ్లి సినిమాలో పృథ్విరాజ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తావనకు వచ్చింది. ఆ పాత్ర అప్పటి ప్రేక్షకులను ఎంతగా భయపెట్టిందో, ఇప్పటికీ దాని ప్రభావం ఎంత ఉందో చెప్పక్కర్లేదు. ఈ పాత్రపై పృథ్వీరాజ్ స్పందిస్తూ.. ఆ పాత్రకు లభించిన ప్రశంసల వెనుక దర్శకుడు కోడి రామకృష్ణ విజన్ ఉందని, ఆయన అద్భుతమైన దర్శకత్వంతోనే ఆ పాత్ర అంతటి గుర్తింపు పొందిందని తెలిపారు. 26-27 సంవత్సరాలు గడిచినా కూడా ఆ పాత్ర తనపై ఒక స్టాంప్‌లా నిలిచిపోయిందని, ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడతారని పృథ్విరాజ్ చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
పెళ్లి సినిమాకు తాను అందుకున్న మొదటి పారితోషికం గురించి మాట్లాడుతూ, ఆ చిత్రానికి తనకు రూ.50,000 లభించాయని పృథ్విరాజ్ వెల్లడించారు. 1995లో రూ.50,000 అనేది అప్పట్లో చాలా పెద్ద మొత్తం అని, ఆ డబ్బుతో తాను ఒక మారుతి కారు కొనుక్కున్నానని పంచుకున్నారు. ఆ సమయంలో అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆ డబ్బుతో కారు కొనగలిగానని తెలిపారు. ప్రస్తుతం తన లుక్ గురించి కూడా పృథ్విరాజ్ వివరించారు. ఒక కొత్త సినిమా కోసం తాను 80 ఏళ్ల వయస్సున్న ముసలాయన పాత్రను పోషిస్తున్నానని, అది సినిమాలో హీరో పాత్ర అని చెప్పారు. ఈ పాత్ర కోసం డైరెక్టర్ సూచన మేరకు తన కేశాలకు రంగు వేసుకున్నానని, మొదట బ్లీచింగ్ ద్వారా కేశాల రంగు మార్చాలని ప్రయత్నించగా, అవి దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పుడు తన కేశాలు కింద నల్లగా, పైన తెల్లగా ఉన్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. అవసరమైతే విగ్ ఉపయోగించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
నటుడిగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడం వెనుక గల కారణాలను పృథ్వీరాజ్ వివరించారు. తాను హ్యాండ్సమ్‌గా ఉన్నప్పటికీ, విలన్ పాత్రలను ఎందుకు ఎంచుకుంటున్నారని అడగగా, హీరోగా నటించడంలో ఉన్న రిస్క్‌ల గురించి పృథ్విరాజ్ మాట్లాడారు. పెళ్లి తర్వాత తాను వసంత వంటి కొన్ని చిత్రాలలో హీరోగా నటించానని, అయితే అవి విజయవంతం కాలేదని చెప్పారు. సినిమా పరాజయం పాలైనప్పుడు నిర్మాతలకు కలిగే ఆర్థిక నష్టాన్ని, వారి బాధను చూసి తాను హీరో పాత్రల జోలికి వెళ్లడం మానేశానని తెలిపారు. అందువల్ల, ఇతరులకు నష్టం కలగకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడం మంచిదని తాను భావిస్తున్నానని పృథ్విరాజ్ స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..