
దివంగత ప్రముఖ నటుడు, కమెడియన్ ఏవీఎస్ కుమార్తె శాంతి, అల్లుడు శ్రీనివాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి అందించిన అజ్ఞాత సహాయం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏవీఎస్ గారి లివర్ సర్జరీ సమయంలో ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, పరిశ్రమ నుండి అందిన అండదండలు, అలాగే నటీనటుల వృత్తి జీవితంపై పలు విషయాలను పంచుకున్నారు. 2008లో ఏవీఎస్ గారికి అత్యంత ఖరీదైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీకి అప్పట్లోనే దాదాపు 65 లక్షల రూపాయల భారీ ఖర్చు అయ్యిందని శాంతి వెల్లడించారు. లండన్ నుండి ప్రఖ్యాత డాక్టర్ మహమ్మద్ రేలాను పిలిపించి ఈ ఆపరేషన్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ ఆర్థిక భారాన్ని భరించడానికి పరిశ్రమ నుండి అనూహ్యమైన మద్దతు లభించిందని, ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ అందించిన సహాయం మరువలేనిదని తెలిపారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఎవరికీ తెలియకుండా సర్జరీ బిల్లు చెల్లించి వెళ్ళిపోయారని, చాలా కాలం తర్వాత ఈ విషయం తమకు తెలిసిందని శాంతి చెప్పారు. చిరంజీవి కూడా అన్ని విధాలా అండగా నిలిచారని, ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించకుండా సహాయం చేశారని ఆమె అన్నారు. మురళీ మోహన్ గారు ముందుండి ఈ సహాయ కార్యక్రమాలను సమన్వయం చేశారని, పరిశ్రమ తమ కుటుంబానికి అండగా నిలిచిందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నాగ్ బాబు కూడా తమకు వ్యక్తిగతంగా సహాయం చేశారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, శాంతి చిరంజీవి గారితో కలిసి ఒక సినిమాలో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఏవీఎస్ గారి కుమార్తెగా చిరంజీవి ఆమెను గుర్తించి, బాగా కష్టపడు అని ప్రోత్సహించడం, తర్వాత ఆమె నటనను చాలా బాగా చేస్తున్నావు అని ప్రశంసించడం తన జీవితంలో ఒక పెద్ద అవార్డుతో సమానం అని శాంతి ఆనందంగా తెలియజేశారు. చిరంజీవి గారి నుండి అటువంటి కాంప్లిమెంట్ పొందడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..