Naga Chaitanya: భారీ మల్టీ స్టారర్‌కు తెర తీసిన పరశురామ్‌.. నాగ చైతన్యతో పాటు నటించే ఆ యంగ్‌ హీరో అతడేనా.?

|

Sep 06, 2022 | 6:40 AM

Naga Chaitanya: ప్రస్తుతం మల్టీస్టారర్‌ సినిమాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా నేపథ్యంగా సినిమాలు విడుదలవుతోన్న తరుణంలో రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు కలిసి నటిస్తున్నారు...

Naga Chaitanya: భారీ మల్టీ స్టారర్‌కు తెర తీసిన పరశురామ్‌.. నాగ చైతన్యతో పాటు నటించే ఆ యంగ్‌ హీరో అతడేనా.?
Naga Chaitanya
Follow us on

Naga Chaitanya: ప్రస్తుతం మల్టీస్టారర్‌ సినిమాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా నేపథ్యంగా సినిమాలు విడుదలవుతోన్న తరుణంలో రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు కలిసి నటిస్తున్నారు. నటించడమే కాదు హిట్‌లు కూడా కొడుతున్నారు. దీంతో దర్శకులు సైతం బహుభాష హీరోలను ఒకతాటిపైకి తెస్తూ సినిమాలను ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా స్టార్‌ దర్శకుడు పరశురామ్‌ కూడా ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పరశురామ్‌ నాగచైతన్యతో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే పరశురామ్‌ ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు తమిళ స్టార్‌ హీరో శింబును కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో శింబు నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పరశురామ్‌ చెప్పిన కథ నాగచైతన్యకు నచ్చడంతో పరశురామ్‌ పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ మల్టీ స్టారర్‌ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..