ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదనే విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బుల్లి తెర, ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు రాధాకృష్ణ ఇప్పటి వరకు కొత్త మూవీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
సహజంగా అయితే ఒక ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మరోసారి ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంత సులభమైన విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం రాధాకృష్ణపై ఉన్న నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈసారి రాధా కృష్ణ డైరెక్ట్ చేయబోతున్న మూవీలో ప్రభాస్ హీరోగా నటించడం లేదు. గోపీచంద్‌తో తెరకెక్కించే సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో గోపిచంద్ హీరోగా జిల్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే రాధాకృష్ణ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. రాధేశ్యామ్ వంటి ఫ్లాప్ తర్వాత కూడా ప్రభాస్ మరోసారి అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే గోపిచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత రాధాకృష్ణ మూవీలో జాయిన్ కానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..