Jamuna: బయోపిక్‌గా రానున్న వెండి తెర సత్యభామ జీవిత కథ.. జమున పాత్రలో నటించేది ఎవరంటే..

అలనాటి అందాల తార జమున ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో నటించిన జమున తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు 200కిపైగా సినిమాల్లో నటించిన జమున 86వ ఏట అనారోగ్యం కారణంగా జవనరి 27వ తేదీన...

Jamuna: బయోపిక్‌గా రానున్న వెండి తెర సత్యభామ జీవిత కథ.. జమున పాత్రలో నటించేది ఎవరంటే..
Jamuna Biopic

Updated on: Jan 30, 2023 | 3:02 PM

అలనాటి అందాల తార జమున ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో నటించిన జమున తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు 200కిపైగా సినిమాల్లో నటించిన జమున 86వ ఏట అనారోగ్యం కారణంగా జవనరి 27వ తేదీన తుది శ్వాస విడిచారు. సావిత్రి తర్వాత అంతటి స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్న జమున నిజ జీవిత కథను ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కించనున్నారని సమాచారం. జమున బయోపిక్‌ను తీసేందుకు తమిళ ఇండస్ట్రీ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని టాక్‌.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో జమున పాత్రలో హీరోయిన్‌ ఎవరనే అంశంపై ఆసక్తికరమైన వార్త ఒకటి హల్చల్‌ చేస్తోంది. జమున పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్న నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ తమన్నను ఈ విషయమై స్పందించగా, దానికి తమన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే తమన్నా కెరీర్ టర్న్‌ తీసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించిన తర్వాత కీర్తి సురేష్‌ కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకున్న కీర్తికి ఏకంగా నేషనల్ అవార్డ్‌ వరించింది. మరి తమన్నా జమున బయోపిక్‌తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..