Tollywood : ఆర్తి అగర్వాల్ – కీర్తి సురేష్.. ఇద్దరి మధ్య ఉన్న ఆసక్తికరమైన ‘నువ్వు – నేను’ కనెక్షన్ ఇదే..!

ఆర్తి అగర్వా్ల్.. తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో చెరగని అందమైన రూపం. 14 ఏళ్ల వయసులో నటుడు సునీల్ శెట్టి ఒక స్టేజ్ షోలో ఆమె డాన్స్ చూసి బాలీవుడ్‌లో నటించమని ప్రోత్సహించారు. దీంతో 16 ఏళ్ల వయసులో 'పాగల్‌పాన్' (2001) అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు.ఆ తర్వాత వెంకీ జోడీగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.

Tollywood : ఆర్తి అగర్వాల్ - కీర్తి సురేష్.. ఇద్దరి మధ్య ఉన్న ఆసక్తికరమైన నువ్వు - నేను కనెక్షన్ ఇదే..!
Aarthi Agarwal, Keerthy Sur

Edited By:

Updated on: May 14, 2026 | 9:21 PM

ఆర్తి అగర్వాల్, కీర్తి సురేష్.. ఈ రెండు పేర్లు పక్కపక్కన చూడగానే ఇద్దరికీ అసలు పోలిక ఏంటి అని ఆశ్చర్యపోవడం సహజం. ఎందుకంటే ఆర్తి అగర్వాల్ గత జనరేషన్‌కు చెందిన హీరోయిన్ అయితే, కీర్తి సురేష్ ఈ తరం స్టార్ హీరోయిన్. ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉన్నా, వారి సినీ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన, చిత్రమైన పోలిక దాగి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కో-ఇన్సిడెంట్స్ జరగడం అరుదేమీ కాదు. కానీ డిఫెరెంట్ జనరేషన్స్‌కు చెందిన ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల కెరీర్ల మధ్య ఉన్న ఈ కనెక్షన్ మాత్రం సినీ అభిమానులను భలేగా ఆకట్టుకుంటుంది. ఆర్తి అగర్వాల్.. 2000ల ప్రారంభంలో కుర్రాళ్ల కలల రాకుమారి. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన తొలి తెలుగు సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’తోనే యావత్ తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది.

ఆ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ఆర్తి, ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన బ్యూటీగా ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కనుమరుగై.. 2015లో అనారోగ్యంతో మరణించింది. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఈ జనరేషన్ ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే ‘మహానటి’ తను. రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీ, తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మొదటి సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కీర్తి, సావిత్రి బయోపిక్ ‘మహానటి’తో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకుని ఎవర్ గ్రీన్ స్టార్‌గా ఎదిగింది.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ ప్రస్తుత టాప్ హీరోయిన్ల రేసులో ఎప్పుడూ ముందుంటోంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఉన్న ఆ క్రేజీ పోలిక వాళ్ల మొదటి రెండు సినిమాల టైటిల్స్‌లో దాగి ఉంది. ఆర్తి అగర్వాల్ నటించిన మొదటి తెలుగు సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ కాగా, రెండో సినిమా ‘నువ్వు లేక నేను లేను’. ఈ రెండూ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఈ రెండు సినిమాల టైటిల్స్‌ ప్రారంభంలోనూ ‘నువ్వు’ అనే పదం కామన్‌గా ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా కనీసం ఐదేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలేసింది ఆర్తి అగర్వాల్. ఉదయ్ కిరణ్ నుంచి మొదలుపెట్టి చిరంజీవి వరకు ప్రతీ హీరోతో నటించింది. సునీల్, రాజశేఖర్ లాంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది ఆర్తి.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

అదే సమయంలో కీర్తి సురేష్ కెరీర్ చూసుకుంటే.. రామ్ పోతినేనితో చేసిన మొదటి సినిమా ‘నేను శైలజ’, నానితో చేసిన రెండో సినిమా ‘నేను లోకల్’. ఈ రెండింటి టైటిల్స్ మొదట్లోనూ ‘నేను’ అనే పదం కామన్‌గా ఉండటం విశేషం. పైగా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇలా ఒకప్పటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్, ఇప్పటి స్టార్ కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభ చిత్రాల మధ్య ‘నువ్వు – నేను’ అనే ఒక అద్భుతమైన, యాదృశ్చికమైన కనెక్షన్ ఏర్పడింది. అప్పట్లో ఆర్తి ‘నువ్వు’ అంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటే.. ఇప్పుడు కీర్తి ‘నేను’ అంటూ కుర్రకారు హృదయాలను ఏలుతోంది. కాలాలు మారినా, జనరేషన్లు మారినా.. ఇద్దరు వేర్వేరు స్టార్ హీరోయిన్ల ప్రయాణంలో ఇలా ఒకే తరహా మ్యాజిక్ రిపీట్ కావడం నిజంగా టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us