Pradeep Movie: తన మూవీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.. ప్రామిస్ చేస్తున్న ప్రముఖ యాంకర్..

Pradeep Movie: తన సినిమా ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఆయన హీరోగా పరిచయం

Pradeep Movie: తన మూవీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.. ప్రామిస్ చేస్తున్న ప్రముఖ యాంకర్..

Updated on: Jan 23, 2021 | 9:08 PM

Pradeep Movie: తన సినిమా ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్‌గా మున్నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మున్నా కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని నిర్మాత చాలా సపోర్ట్ చేశారని తెలిపారు. ప్రొడ్యూసర్‌కు జాబ్ శాటీస్ ఫాక్షన్‌తో పాటు జేబు శాటీస్ ఫాక్షన్ కూడా కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సినిమా చూసాక ప్రేక్షకుడు ఎంతో అనుభూతితో థియేటర్లోంచి బయటకు వస్తాడని తెలిపారు.

ఒకినావా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సరుకు రవాణాకు సూపర్.. ధర ఎంతో తెలుసా..