Lok Sabha Elections 2024: మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..

2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మే 7న మూడో దశ పోలింగ్ లో 94 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ సమయంలో ఓటరు తన పేరు మీద ఇప్పటికే ఓటు వేసినట్లు తెలియడంతో షాక్ కు గురయ్యారు. ఇలాంటి ఉదంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏమి చేయాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దీన్ని దొంగ ఓటు అంటారు.

Lok Sabha Elections 2024: మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Follow us

|

Updated on: May 06, 2024 | 8:25 AM

2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మే 7న మూడో దశ పోలింగ్ లో 94 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ సమయంలో ఓటరు తన పేరు మీద ఇప్పటికే ఓటు వేసినట్లు తెలియడంతో షాక్ కు గురయ్యారు. ఇలాంటి ఉదంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏమి చేయాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దీన్ని దొంగ ఓటు అంటారు. ఇది భారత ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లోని సెక్షన్ 49 (పి)లో పేర్కొనబడింది. 1961లో ఎన్నికల సంఘం ఓటరు ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈ సెక్షన్ దోహదపడుతుంది.

మీ స్థానంలో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి?

అటువంటి పరిస్థితిలో, ముందుగా పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారిని కలుసుకుని ఓటు వేయమని విజ్ఞప్తి చేయండి. ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. బూత్ ఏర్పాట్ల నుంచి ఈవీఎంల వరకు పూర్తి బాధ్యతలు ఆయనే నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ఓటరును ఎన్నికల అధికారులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పగలగాలి. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు, పోలింగ్ బూత్ స్లిప్‌లను రుజువుగా చూపించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తరువాత ప్రిసైడింగ్ అధికారి మీ సమాధానాలతో సంతృప్తి చెందితే, మీరు ఓటు వేయడానికి అనుమతిస్తారు. అదే సమయంలో, ఎవరైనా అలా మోసం చేయడానికి ప్రయత్నిస్తే, ప్రిసైడింగ్ అధికారి కూడా ఆ ఓటరుపై ఫిర్యాదు చేయవచ్చు. ఇలా పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.

మీ ఓటు దొంగిలించబడితే మీరు ఎలా ఓటు వేయగలరు?

ప్రిసైడింగ్ అధికారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఓటరు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలని చెబుతారు. అలాంటి ఓటర్లు ఈవీఎంల ద్వారా ఓటు వేయలేరు. ఈ రకమైన ఓటును టెండర్ ఓటు అంటారు. దీని కోసం, ఓటర్లకు బ్యాలెట్ పేపర్ ఇవ్వబడుతుంది, అక్కడ వారు తమకు నచ్చిన అభ్యర్థిని గుర్తించడం ద్వారా ఓటు వేయగలరు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను కవరులో ఉంచి పెట్టెలో భద్రపరుస్తారు.

ఇవి కూడా చదవండి

టెండర్ ఓటు విలువ ఎంత?

సాధారణంగా ఈ ఓట్లను లెక్కించరు. బీబీసీ నివేదికలో చెప్పిన దాని ప్రకారం, ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినా, టెండర్ ఓట్లు లెక్కించబడవని దేశ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. టాస్ గెలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే, టాస్ ఓడిన అభ్యర్థికి కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది. టెండర్ ఓట్లు తనకు అనుకూలంగా రావచ్చని కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, టెండర్ ఓటు సహాయంతో, దొంగ ఓట్లను గుర్తించి టెండర్ ఓటులో ఎవరికి అనుకూలంగా వచ్చాయో పరీక్షిస్తారు. టెండర్ ఓటింగ్ లో అభ్యర్థికి వచ్చిన ఓట్లను ఈవీఎంలో పోలైన ఓట్లనుంచి తొలగిస్తారు. అప్పుడు ఎవరికి నిజమైన ఓట్లు పోలయ్యాయో ఇట్టే తెలిసిపోతుంది. అభ్యర్థి విజయం కచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో టెండర్ ఓటు ఉపయోగపడుతుంది.

టెండర్ ఓటు సమస్య ఎప్పుడు లేవనెత్తారు?

2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జోషి, బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. 2009లో పోలైన ఓట్లలో కొన్ని టెండర్ ఓట్లు పడ్డాయని పేర్కొంటూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో ఫలితం టై అని తేలింది. డ్రా తర్వాత కళ్యాణ్ సింగ్ చౌహాన్‌ను విజేతగా ప్రకటించారు. అప్పుడు టెండర్ ఓట్లను లెక్కించి సరైన ఫలితాన్ని పొందగలిగారు.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?