Khushboo campaign : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకుపోతున్నారు. ఓటర్లకు అదిరిపోయే హామీలు ఇస్తూ…ఔరా అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు బీజేపీ నేత, థౌసండ్ లైట్స్ నియోజక వర్గం అభ్యర్థిలో ఖుష్బూ కూడా చేరిపోయారు. తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ పరిధిలో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని చెబుతున్న ఖుష్బూ… తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. బ్రూణహత్యలను నివారించేందుకు నగదు సాయం చేస్తానని తెలిపారు. ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఆమె ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు. చిన్నారులను ముద్దాడుతూ ప్రచారం సాగించి సంగతి విదితమే.