UP Elections: ఐదో దశ ఎన్నికల అభ్యర్థుల నేర చరిత్ర అధికమే.. పోటీలో ఉన్న ధనవంతుల్లో ముగ్గురు అభ్యర్ధులు ఆ పార్టీ వారే..

|

Feb 25, 2022 | 8:23 AM

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఐదో దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరగనున్న 60 శాతానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు(Criminal Cases) కలిగి ఉన్నారని...

UP Elections: ఐదో దశ ఎన్నికల అభ్యర్థుల నేర చరిత్ర అధికమే.. పోటీలో ఉన్న ధనవంతుల్లో ముగ్గురు అభ్యర్ధులు ఆ పార్టీ వారే..
Up Elections
Follow us on

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఐదో దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరగనున్న 60 శాతానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు(Criminal Cases) కలిగి ఉన్నారని ఒక నివేదిక తెలిపింది. అంతే కాకుండా పోటీలో ఉన్న 685 మంది అభ్యర్థుల్లో 185 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 141 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని అంగీకరించారని “ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్” నివేదిక పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక(Report) రూపొందించినట్లు వెల్లడించింది. ఎనిమిది మంది అభ్యర్థుల అఫిడవిట్‌లు అసంపూర్తిగా ఉన్నందున వాటిని విశ్లేషించలేమని పోల్స్ సంస్కరణల న్యాయవాద సంఘాలు తెలిపాయి.

అమేథీ, అయోధ్య, బహ్రైచ్, బారాబంకి, చిత్రకూట్, గోండా, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్, శ్రావస్తి, సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న ఓటింగ్ జరిగిన రాయ్ బరేలీ జిల్లాలో ఒక స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు జరగనున్న 61 స్థానాల్లో 39 స్థానాలు రెడ్ అలర్ట్ జోన్ పరిధిలో ఉన్నాయని నివేదిక తెలిపింది. 12 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలు, ఒకరిపై అత్యాచారం కేసు, ఎనిమిది మంది అభ్యర్థులపై హత్య కేసులు, 31 మందిపై హత్యాయత్నం కేసులున్నాయని నివేదిక బహిర్గతం చేసింది.

ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే.. 246 మంది అభ్యర్థులు రూ. ఒక కోటి కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని, 84 మందికి రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయని వివరించింది. బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు అత్యంత ధనవంతులు అని నివేదిక వెల్లడించింది. మయాంకేశ్వర్ శరణ్ సింగ్ (తిలోయ్) రూ. 58 కోట్లు, సింధుజా మిశ్రా సేనాని (కుందా) రూ.52కోట్లు, సంజయ్ సింగ్ (అమేథి) రూ.50 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతాపూర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి హీరామణి అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. ఆమె ఆస్తి కేవలం రూ. 8,000.

Also Read

Horoscope Today: ఈ రాశుల వారు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.. ఆర్థిక లాభాలు కలుగుతాయి

టీచర్‌ ముందు బెంచీలో కూర్చోబెట్టిందని !! ఆ విద్యార్థి ఏం చేశాడో తెలుసా ?? వీడియో

Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో