నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయిందా..? నివేదిత రెడ్డి నామినేషన్‌తో తెరపైకి కొత్త ఇష్యూ..!

|

Mar 27, 2021 | 10:56 AM

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ తన అభ్యర్థి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగానే నివేదిత నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయిందా..? నివేదిత రెడ్డి నామినేషన్‌తో తెరపైకి కొత్త ఇష్యూ..!
Niveditha Reddy Bjp Candidate
Follow us on

Niveditha Reddy filed Nomination: నాగార్జునసాగర్‌లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాగర్‌ ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, బీజేపీ అదిష్టానం మాత్రం నివేదిత రెడ్డిని ఫైనల్ చేయకుండానే నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. అటు బీజేపీ కండువా కూడా లేకుండా నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఓ వైపు బీజేపీ తన అభ్యర్థి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగానే నివేదిత నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

ఇదిలావుంటే, సాగర్ అభ్యర్థి ఎంపికను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ సీనియర్లకు అప్పజెప్పారు. దీంతో ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో అభ్యర్థి ఎంపికపై బీజేపీ అధ్యక్షుడు చర్చించనున్నారు. గత అర్థరాత్రి వరకు కడారి అంజయ్య, నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతో బండి సంజయ్ చర్చలు జరిపారు. ఆశావాహుల అభిప్రాయాలను పార్టీ సీనియర్ నేతలకు సంజయ్ తెలియజేయనున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో అభ్యర్థి ఎంపికపై సంజయ్ ఫలు దఫాలుగా చర్చించారు. పార్టీ సీనియర్లు సూచించిన పేరును జాతీయ నాయకత్వానికి పంపించనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ టికెట్ ఆశావాహుల జాబితాలో అంజయ్య యాదవ్, నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రవి నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు సాగర్ బరిలో ఓ నామినేషన్ కొత్త ఇష్యూని తెరపైకి తెస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు. ఆయన భార్య అయిన నివేదిత గతంలోనూ బీజేపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా సాగర్‌ ఉపఎన్నికలో తానే అభ్యర్థినంటున్నారు. అనడమే కాదు.. అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకుండానే ఏకంగా నామినేషన్ దాఖలు చేశారు. నివేదిత తనను తాను సాగర్‌ బీజేపీ అభ్యర్థిగా చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం నివేదితను రెబల్ అనాలా..లేదంటే బీజేపీ అభ్యర్థి అనాలా అనే అంశం కూడా క్లారిటీ లేదు. అదినాయకత్వం తనకు కచ్చితంగా బీజేపీ టికెట్ కేటాయిస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరి ఒకవేళ బీజేపీ మరో అభ్యర్థిని ఎవరినైనా రంగంలోకి దింపింతే నివేదిత నామినేషన్‌ ఉపసంహరించుకుంటారా.. లేదంటే రెబల్‌గా కొనసాగే అవకాశం ఉందా అన్నది వేచిచూడాలి.

అయితే ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన తనకు కాకపోతే.. టికెట్ ఇంకెవరికస్తారు అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నివేదిత ఇష్యూని బీజేపీ పార్టీ ఎలా చూస్తోంది. నివేదితకే ఇస్తామని కంకణాల శ్రీధర్‌కు పార్టీ పెద్దలు చెప్పారా? లేదంటే టికెట్ ఇవ్వకపోయినా రెబల్‌గా నిలబడతాం అని నివేదిత సంకేతం ఇస్తున్నారా? ప్రస్తుతం సాగర్ బరిలో కనిపిస్తున్న ట్విస్ట్ ఇది.

Read Also…  West Bengal Election 2021 Phase 1 Voting LIVE: బెంగాల్‌ పోలింగ్‌లో ఓటర్లకు ప్రలోభాలు.. తృణమూల్‌, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు