కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. తలసేరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కన్నూర్ శాఖ అధ్యక్షుడు ఎన్.హరిదాస్ నామినేషన్ పత్రాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం లేదన్న కారణంగా ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆలాగే గురువాయూర్ నియోజకవర్గంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు నివేదితా సుబ్రమణ్యం నామినేషన్ ని కూడా ఇదే కారణాలపై తోసిపుచ్చారు. ఇడుక్కి జిల్లా దేవీకులంలో అన్నా డీఎంకే అభ్యర్థి ధనలక్ష్మి నామినేషన్ ఫారం పూర్తిగా లేదన్న కారణంపై ఆమె నామినేషన్ కూడా తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో అన్నా డీఎంకే అభ్యర్థికి బీజేపీ మద్దతునిస్తోంది. కాగా తమ నామినేషన్లను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇద్దరు బీజేపీ అభ్యర్థులు కేరళ హైకోర్టుకెక్కారు. వీరి పిటిషన్లను కోర్టు పరిశీలిస్తోంది. వీటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఈసీని ఆదేశించింది.
కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం కేరళలో ఎర్నాకుళం, కొట్టాయం, అలపుజ జిల్లాల్లో నేడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు . ఆయనతో బాటు కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్, ఇతర పార్టీ నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బీజేపీ అభ్యర్థుల పిటిషన్లపై మరికొద్ది సేపట్లో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.
కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video