పార్టీ టిక్కెట్ల కోసం కర్ణాటక కాంగ్రెస్‌లో గట్టి పోటీ.. మాకే ఇవ్వాలంటూ ఆశావహుల ఆందోళన..

|

Apr 03, 2023 | 3:19 PM

Karnataka Elections 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్ల కోసం ఈసారి గట్టి పోటీ పెరిగింది. టిక్కెట్లు ఆశిస్తున్న పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ అనుచరులతో కలిసి బెంగళూర్‌లో పీసీసీ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు.

పార్టీ టిక్కెట్ల కోసం కర్ణాటక కాంగ్రెస్‌లో గట్టి పోటీ.. మాకే ఇవ్వాలంటూ ఆశావహుల ఆందోళన..
Karnataka Congress
Follow us on

Karnataka Elections 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్ల కోసం ఈసారి పోటీ పెరిగింది. టిక్కెట్లు ఆశిస్తున్న పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ అనుచరులతో కలిసి బెంగళూర్‌లో పీసీసీ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు. పార్టీ టికెట్ తమకేే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపు (4 ఏప్రిల్) కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో కర్ణాటక ఎన్నికలకు  కాంగ్రెస్‌ అభ్యర్ధుల రెండో జాబితాను ప్రకటించనుంది.ఈ రెండో జాబితాలో తమ నాయకుడికి టిక్కెట్ ఇవ్వకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతామంటూ కొందరు ఆశావహుల మద్ధతుదారులు హెచ్చరించారు. అటు ఆయా నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు తమకే పార్టీ టిక్కెట్ ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పార్టీ టికెట్ల కోసం ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉందని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం అహ్మద్ తెలిపారు. రేపటి సీఈసీ సమావేశంలో లోతుగా చర్చించి, అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తసీుకుంటామని చెప్పారు. సర్వే నివేదికలు కూడా తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసింది . 124 మంది అభ్యర్ధులతో తొలిజాబితాను విడుదల చేశారు. రెండో జాబితాలో 100 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. మంగళవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు.

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పీసీసీ ప్రెసిడెంట్‌ శివకుమార్‌ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు.

పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను సీఈసీ ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య.. సోమవారం సాయంత్రం బెంగుళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మరికొందరు పార్టీ నేతలు కూడా ఢిల్లీలో మకాం వేశారు. ఏప్రిల్ 9న కోలార్‌లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై ఢిల్లీ పెద్దలతో వారు చర్చిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..