
కర్నాటకలో పొలిటికల్ రన్ మొదలైంది. సామాన్యుడి నుంచి సంపన్న ఓటరును ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వీరు అని తేడా లేకుండా అందరూ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాబితాను విడుదల చేయగా.. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. బీజేపీ నుంచి వచ్చిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. దీంతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నాయి.
అలాగే, సీఎం అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, మొహమ్మద్ ఖాన్. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అజారుద్దీన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కన్హయ్య కుమార్‌లు కూడా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న రాజ్ బబ్బర్, దివ్య సపందన కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు సచిన్ పైలట్ పేరు జాబితా నుంచి తొలగించింది.
#KarnatakaAssemblyElection2023 | Congress issues a list of star campaigners for the upcoming election.
Party president Mallikarjun Kharge, UPA chairperson Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra, state chief DK Shivakumar, LoP Siddaramaiah, Jagadish Shettar, Shashi… pic.twitter.com/kQARlZZ4aL
— ANI (@ANI) April 19, 2023
అదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా 40 మంది పేర్లు ఉన్నాయి. ఏప్రిల్ 26, 30 తేదీల్లో కాకుండా మే 6న కర్ణాటకలో ర్యాలీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు.
Bharatiya Janata Party releases list of star campaigners for Karnataka Assembly elections
PM Modi, JP Nadda, Rajnath Singh and Amit Shah are among those who will be campaigning in the state pic.twitter.com/8DW3qereia
— ANI (@ANI) April 19, 2023
కర్నాటకలో మే 10న ఒకే దశ ఓటింగ్ జరగనుంది. అయితే మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ముఖ్యంగా, 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తుంది. కర్నాటకలో రానున్న ఎన్నికల్లో 9.17 లక్షల మందికి పైగా మొదటి సారి ఓటర్లు పాల్గొంటారని రాజీవ్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం