Assembly Elections: 5 రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ర్యాలీల, రోడ్ షోపై ఆంక్షలు పొడిగింపు!

|

Jan 22, 2022 | 7:26 PM

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై ఆంక్షలు పొడిగించింది.

Assembly Elections: 5 రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..   ర్యాలీల, రోడ్ షోపై ఆంక్షలు పొడిగింపు!
Election Expenditure
Follow us on

5 states Assembly Elections 2022: కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై ఆంక్షలు పొడిగించింది. రోడ్ షోలు, ర్యాలీలపై ఈనెల 31 వరకు నిషేధం విధించారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓ వైపు ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈసీ బహిరంగ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు, ప్రధాన ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అధికారులు సూచనలు పరిగణలోకి తీసుకుని మరోసారి ర్యాలీలు, రోష్ షోలపై నిషేధం పొడగించింది.

భౌతిక ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం పెంచింది. బహిరంగ సభకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినప్పటికీ జనవరి 31 వరకు ఏ రాజకీయ పార్టీ భౌతిక ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం తెలిపింది. భౌతిక ర్యాలీ, రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం కొనసాగించింది . డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేందుకు కమిషన్ 5 నుంచి 10 మందికి పెంచింది . మొదటి దశ అభ్యర్థులకు జనవరి 28 నుంచి, రెండో దశ అభ్యర్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఈ సడలింపు వర్తిస్తుంది.

తొలి దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను జనవరి 27న ఖరారు చేయనుండగా, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బహిరంగ సభలకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం, అభ్యర్థులు బహిరంగ సభలను గరిష్టంగా 500 మంది లేదా 50 శాతం స్థలంతో బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించవచ్చు. SDMA నిర్దేశించిన పరిమితి ప్రకారం ఈ ఈవెంట్‌లను జనవరి 28 నుండి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించవచ్చు.

రెండో దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను 2022 జనవరి 31న ఖరారు చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సమయంలో, స్థలం ప్రకారం.. SDMA నిర్దేశించిన పరిమితి ప్రకారం గరిష్టంగా 500 మంది లేదా 50 శాతం మంది వ్యక్తులతో బహిరంగ సభలు అనుమతించడం జరుగుతుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు నిర్వహించవచ్చు.

అలాగే, 5 మందికి పైగా ఇంటింటికీ ప్రచారం చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి కూడా ఇచ్చింది. ఇప్పుడు 5 మందికి బదులు 10 మంది ప్రచారానికి వెళ్లవచ్చు. ఇందులో సెక్యూరిటీ సిబ్బందిని ప్రత్యేకంగా ఉంచారు. అదే సమయంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించే ఇతర మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగుతాయి. దాని ప్రకారం సమావేశాలు నిర్వహించవచ్చు.

సాధారణ కరోనా పరిమితులతో వీడియో వ్యాన్‌ల ద్వారా ప్రచారాన్ని కూడా ఎన్నికల సంఘం అనుమతించింది. ఇందులో, బహిరంగ స్థలం సామర్థ్యం ప్రకారం.. SDMA నిర్ణయించిన పరిమితి ప్రకారం గరిష్టంగా 500 మంది లేదా 50 శాతం మంది పాల్గొనవచ్చు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సరైన ప్రవర్తన, మార్గదర్శకాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌తో పాటు ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని.. నామినీలను గుర్తించి వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని తెలిపింది.


Read Also…. UP Elections 2022: యోగి బాటనే ఎంచుకున్న అఖిలేశ్.. ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక..