BJP Tirupati Plan: తిరుపతి కోసం బీజేపీ కొత్త గేమ్ ప్లాన్.. జనసేనాని మచ్చిక కోసం ప్రత్యేక వ్యూహం

|

Mar 29, 2021 | 3:39 PM

మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో పెద్దగా ఓట్లు, సీట్లను రాబట్టుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్‌సభ సీటును గెలుచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను, వ్యూహాన్ని అమలు చేస్తోంది.

BJP Tirupati Plan: తిరుపతి కోసం బీజేపీ కొత్త గేమ్ ప్లాన్.. జనసేనాని మచ్చిక కోసం ప్రత్యేక వ్యూహం
Follow us on

BJP Tirupati plan and strategy: మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో పెద్దగా ఓట్లు, సీట్లను రాబట్టుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్‌సభ సీటును గెలుచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను, వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏపీలో పట్టు కావాలంటే తిరుపతిలో మెట్టు దిగాలని బీజేపీకి అర్థమైనట్టు ఉంది. అందుకే సుత్తి లేకుండా సూటిగా సీఎం అభ్యర్థి పవన్ అంటూ బీజేపీ చెప్పేసింది. పార్టీలన్నీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ తిరుపతి ఉపఎన్నికలో.. ప్రభావం చూపాలంటే జనసేనాని సంపూర్ణ మద్దతు ఉండాల్సిన అవసరాన్ని కమలనాథులు గుర్తించబట్టే.. ఈ ప్రకటన వెలువడిందని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రజాదరణ రావాలంటే జనసేనాని పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు అవసరమని బీజేపీ అధిష్టానం గ్రహించింది. కాపుల ఓట్లు అధికంగా వున్న తిరుపతి లాంటి ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ చొరవ లేకుండా వారి ఓట్లను సాధించలేమని కమల నాథులు గుర్తించారు. అందుకే ఆయన్ని మచ్చిక చేసుకునేందుకు ఏకంగా సీఎం క్యాండిడేట్ ప్రకటన చేసేశారు బీజేపీ నేతలు. మరోవైపు తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రత్నప్రభ నేరుగా హైదరాబాద్ వెళ్లి పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. ఇది కూడా అధిష్టానం చేసిన సూచనే అని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ కాంబోకు తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీజేపీ పెద్దలు ఎంతమంది ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ లెక్క వేరని గ్రహించారు బీజేపీ పెద్దలు. అందుకే సుత్తిలేకుండా సూటిగా సీఎం అభ్యర్థి పవన్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. మొన్న తిరుపతి అభ్యర్థిగా రత్నప్రభ ను ప్రకటించిన వెంటనే ఆమె నేరుగా హైదరాబాద్ వెళ్లి పవన్ మద్దతు కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు తాజాగా సోము వీర్రాజు చేసిన సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తిరుపతిలో పవన్ మద్దతు లేకపోతే కష్టమని భావించే బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనసేనకు తిరుపతిలో మంచి కేడర్ ఉంది. జనసేన అభ్యర్థినే పోటీకి నిలబెట్టాలని అక్కడి నేతలు, కార్యకర్తలు పట్టుబట్టారు. కానీ బీజేపీనే అభ్యర్థిత్వం దక్కించుకుంది. అభ్యర్థి తమ పార్టీకి చెందిన వారైనా.. జనసేన సపోర్ట్ లేకపోతే కష్టమని ఆ పార్టీ నేతలే చర్చించుకుని సీఎం మంత్రం జపిస్తున్నారు.

ఎప్పుడు బీజేపీ, జనసేన నాయకులు మాట్లాడినా… ఏపీలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్తువచ్చారు. కానీ గ్రౌండ్ రియాల్టీ గ్రౌండ్‌లోకి దిగిన తరువాతేగా తెలిసేది! అదే ఇప్పుడు తిరుపతి ప్రచారంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. దాన్ని వ్యూహాత్మకంగా అమలు కూడా చేస్తోంది. తిరుపతి లోక్‌సభ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరేసి నేతలను ఇంఛార్జీలుగా పెట్టినా.. ఫలితం రాబట్టలేమని గ్రహించి పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేనుకుంటున్నారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ దక్కక పోయిన కనీసం సెకండ్ ప్లేస్‌లో ఉన్నా.. గౌరవంగా ఉంటుందని బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు. అటు వైసీపీ, టీడీపీ అభ్యర్థులను తట్టుకోవాలంటే పవన్ జపం చెయ్యక తప్పదులే అనేది నేటి పబ్లిక్ మాట.

ALSO READ: మండిపోతున్న భానుడు.. ఎండల తాకిడికి జనం విలవిల.. మరింత పెరుగుతాయని హెచ్చరిక