Assam EVM Row: బీజీేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారులో ఈవీఎంలు.. ఆ నాలుగు సెంటర్లలో తిరిగి పోలింగ్..

సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నిక‌ల సంఘం.. ఆ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. గురువారం జ‌రిగిన రెండో విడ‌త ఎన్నిక‌ల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోంది. క‌రీంగంజ్ జిల్లాలో..

Assam EVM Row:  బీజీేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారులో ఈవీఎంలు.. ఆ నాలుగు సెంటర్లలో తిరిగి పోలింగ్..
Assam Evm

Updated on: Apr 02, 2021 | 1:48 PM

బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనవుతోంది. అస్సాంలో జ‌రిగిన రెండో విడ‌త ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో త‌ర‌లించ‌డగా దొరికిపోయాయి. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నిక‌ల సంఘం.. ఆ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. గురువారం జ‌రిగిన రెండో విడ‌త ఎన్నిక‌ల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోంది. క‌రీంగంజ్ జిల్లాలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులకు దారితీసింది.

దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఈవీఎంలు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్‌కు చెందిన బొలేరో వాహ‌నంలో వెళ్తున్న వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసి ఈసీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

తాము వెళ్తోంది బీజేపీ ఎమ్మెల్యే కారులో అని ఎన్నిక‌ల అధికారులకు మొద‌ట్లో తెలియ‌ద‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిజానికి వాళ్లు ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకెళ్తున్న వాహ‌నం మ‌ధ్య‌లో ఆగిపోయింద‌ని, అక్క‌డి నుంచి వాళ్లు ఎన్నిక‌ల సంఘం పైఅధికారుల‌తో మాట్లాడ‌లేక‌పోయార‌ని విచార‌ణ‌లో తేలింది. దీంతో అప్పుడే అక్క‌డి నుంచి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే వాహ‌నంలో వాళ్లు అక్క‌డి నుంచి వెళ్లారు.

అయితే అది ఎమ్మెల్యేకు చెందిన వాహ‌నం అని త‌మ‌కు తెలియ‌ద‌ని ప్రిసైడింగ్ అధికారి వెల్ల‌డించారు. దీనిపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మండిప‌డింది. ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ దీనికి సంబంధించిన వీడియో ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. ఎన్నిక‌ల సంఘం దీనిపై క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి : గుర్తుందా.. వినబడుతోందా.. ఆ శబ్ధం.. ధోని సిక్సర్.. విశ్వవిజేతగా టీమిండియా.. ఆ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు..