ప్రాణాలు నిలిపిన డాక్టర్లకు ఆ వృద్ధ రైతు పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ మాయదారి వైరస్ కుదేలుచేసింది. 

ప్రాణాలు నిలిపిన డాక్టర్లకు ఆ వృద్ధ రైతు పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
Follow us

|

Updated on: Sep 17, 2020 | 12:26 PM

కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ మాయదారి వైరస్ కుదేలు చేసింది.  ఈ విపత్కర సమయంలో మనుషుల్లోని విభిన్న కోణాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు సొంత కుటుంబ సభ్యుల మీద వివక్ష చూపిస్తుంటే, మరికొందరు కరోనా రోగులకు సాయం చేస్తూ తమ  మంచి మనసును చాటుకుంటున్నారు. కాగా కరోనా వృద్దులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతోన్న విషయం  తెలిసిందే. వారికి చికిత్స అందించడం కూడా కష్టతరంగా మారింది. కరోనా సోకిన వృద్దుల్లో ఎక్కువమందికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే డాక్టర్ ఉర్వి శుక్లా నేతృత్వంలోని వైద్య బృందం..కరోనా బారిన పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వృద్దునికి  చికిత్స అందించారు. 15 రోజులపాటు చికిత్స అందించగా..అందులో 12 రోజుల పాటు ఆయన వెంటిలేటర్ పైనే  ఉన్నారు. డాక్టర్ల కృషి ఫలించి ఎట్టకేలకు సదరు వృద్దుడు కరోనాను జయించాడు.

అయితే కరోనా నుంచి కోలుకున్న ఆ వృద్డుడు తనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుల పట్ల కృతజ్ఞత భావం చాటుకున్నాడు. తన ప్రాణాలు నిలిపిన వైద్యులకు అరుదైన బహుమతి పంపించాడు. తన పోలంలోనే పండించిన బియ్యాన్ని వారికి పంపించాడు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేసిన డాక్టర్ ఉర్వి శుక్లా ఆ వ్యక్తి పంపిన బియ్యానికి సంబంధించిన ఫొటోను కూడా  జత చేశారు. ఈ పోస్ట్ చూసిన చాలామంది ఎంతైనా రైతు..రైతే అంటూ  కామెంట్లు  పెడుతున్నారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి