అక్టోబర్ నాటికే అమెరికన్లకు కొవిడ్ వ్యాక్సిన్ః ట్రంప్

ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న దివ్యాషధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నాటికే అమెరికన్లకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

అక్టోబర్ నాటికే అమెరికన్లకు కొవిడ్ వ్యాక్సిన్ః ట్రంప్
Follow us

|

Updated on: Sep 08, 2020 | 5:55 PM

ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న దివ్యాషధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నాటికే అమెరికన్లకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. కరోనా బారిన పడి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులతో పాటు మరణాలతో యూఎస్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. విశ్వవ్యాప్తంగా కొవిడ్ కట్టడికి సాధ్యమైనంత తర్వగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో మూడు వ్యాక్సిన్‌లు తుది దశ ట్రయల్స్‌లో ఉన్నాయని సమాచారం.

ఇదిలాఉంటే… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ విషయమై సోమవారం కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైట్‌హౌజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్… ఏదైనా కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగుతుంది. కానీ, మా ప్రభుత్వం వందల బిలియన్ల డాలర్ల వ్యయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. 2021 జనవరి నాటికి దేశ ప్రజలకు 300 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో “ఆపరేషన్ వార్ప్ స్పీడ్” పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. అమెరికన్లకు సాధ్యమైనంత త్వరగా సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.

కాగా, ట్రంప్ ప్రకటనపై స్పందించిన డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి సెనెటర్ కమలా హారిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మలేమని కొట్టి పారేశారు. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దాని భద్రత, సామర్థ్యంపై కమల సందేహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయమై యూఎస్ అంటు వ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచీ మాట్లాడుతూ అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ తయారీ కష్టతరమైనా.. అసాధ్యం మాత్రం కాదన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో