మాస్కో విక్ట‌రీ డే ప‌రేడ్ కు హాజరుకానున్న రాజ్‌నాథ్ సింగ్

జూన్ 24 న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే సైనిక కవాతులో భారతదేశం తరుపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన‌నున్నారు. ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయ్‌గు ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు పయనం కానున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:49 pm, Sat, 20 June 20

జూన్ 24 న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే సైనిక కవాతులో భారతదేశం తరుపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన‌నున్నారు. ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయ్‌గు ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు పయనం కానున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని రష్యా 75 వ వార్షికోత్సవం వేడుకలను నిర్వహిస్తోంది. ఈ విక్ట‌రీ డే ప‌రేడ్ వేడుక‌ల్లో భారత్ తరుపున త్రివిధ దళాలకు చెందిన 75 మంది మిలిట‌రీ బృందం హాజరుకానుంది. ఈ బృందానికి భార‌త‌ సిక్కు ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన మేజ‌ర్ ర్యాంక్ ఆఫీస‌ర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ర‌ష్యాతో పాటు మిత్ర దేశాలు క‌న‌బ‌రిచిన సాహ‌సం, త్యాగాల‌ను స్మ‌రిస్తూ విక్ట‌రీ డే ప‌రేడ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో సిక్కు రెజిమెంట్ నాలుగు యుద్ధ అవార్డులను సాధించింది.