నేడు విజయ దివాస్.. పాక్‌పై భారత్ ఘన విజయం.. 93వేల మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ..

భారత్-పాక్.. దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్..

నేడు విజయ దివాస్.. పాక్‌పై భారత్ ఘన విజయం.. 93వేల మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 12:31 PM

భారత్-పాక్.. దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా స్వాతంత్ర్యం అనంతరం మొదలు ఇప్పటికీ భారత్ – పాకిస్తాన్ మధ్య వైరం పెరుగుతూనే ఉందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అయితే భారత్ శాంతిమార్గాన్ని అవలంభిస్తుండగా, కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. భారత్ శాంతి మార్గమే పాటిస్తున్నా.. తనదాకా వస్తే మాత్రం తోలుతీస్తానంటూ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తుంది. అలా ఎన్నోసార్లు చేసింది కూడా. నిత్యం పగతో రగిలిపోయే పాకిస్తాన్ భద్రతా బలగాలు.. భారత్‌పై ఎన్నోసార్లు దాడులు చేశాయి. మరి భారత బలగాలు ఊరుకుంటాయా?. దాడులకు ప్రతిగా ధీటైన సమాధానం ఇస్తూ తరిమి తరిమి కొట్టారు. అలాంటి యద్ధాల్లో 1971 యుద్దం గొప్పదని చెప్పాలి. 1971 డిసెంబర్ 03వ తేదీన భారత్-పాక్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం.. డిసెంబర్ 16వ తేదీన భారత్‌ ఎదుట 93వేల మంది పాకిస్తాన్ సైనికుల లొంగుబాటుతో ముగిసింది. అంతటి ఘన విజయానికి నేటికి 49 సంవత్సారలు పూర్తయ్యింది. ఆ ఘన విజయానికి స్మారకంగానే ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. మరి ఆ యుద్ధ విజయ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

యుద్ధానికి కారణం ఇదే..

భారత-పాక్ మధ్య యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వల్ల జరిగింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తానీయుల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ప్రారంభమైంది. 1970లో పాకిస్తాన్ ఎన్నికల తరువాత ఈ పోరాటం మరింత ఉధృతమైంది. 1971 మార్చి 27న, జియావుర్ రహ్మాన్‌.. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. సరిగ్గా అదే రోజున అప్పటి భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే అప్పటికే నాటి బంగ్లాదేశ్(ఢాకా), బెంగాల్ సరిహద్దుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌‌పై సాయుధ చర్య చేపట్టడమే కరెక్ట్ అని భావించిన ప్రధాని ఇందిరా గాంధీ.. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సరిహద్దుల వెంబడి భారీగా భారత బలగాలను మోహరింపజేశారు. అయితే నవంబరు 23 న యాహ్యా ఖాన్ పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధమవమని పిలుపు ఇచ్చాడు. ఈ క్రమంలో డిసెంబరు 3 తేదీన భారత్‌కు చెందిన ఎనిమిది వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దళాలు దాడులు జరిపాయి. దీనికి ఆగ్రహించిన భారత్.. పాక్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ పిలుపుతో పాక్ సైన్యంపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది.

విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ..

1971 డిసెంబరు 8 తేదీన స్క్యాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లయింగ్ ఆఫీసర్ వీకే హెబ్లే, బీసీ కరంబయా, లెఫ్టినెంట్ ఏఎల్ దేవ్‌స్కార్‌లు పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరాలపై మిగ్ 19సి విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. సరిహద్దుల నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్ వైమానిక స్థావరంపై దాడి చేసి చాకచక్యంగా వెనుదిరిగారు. మరోవైపు పదాతిదళాలు సైతం విరుచుకుపడ్డాయి. యుద్ధ ట్యాంకర్లతో బాంబుల వర్షం కురిపించాయి. పాక్ సైన్యం వ్యూహాలను చిత్తు చేస్తూ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయాయి. నావికాదళం కూడా పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాకిస్తాన్ నివాకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. అలా పాకిస్తాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ హడలెత్తించింది. మొత్తంగా 13 రోజుల పాటు భారత్-పాకిస్తాన్ బలగాలు తూర్పు, పశ్చిమ దిశలలో యుద్ధం చేశాయి. అయితే భారత బలగాల ధాటికి తట్టుకోలేక తూర్పు కమాండ్‌కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు భారత్‌కు లొంగిపోయాయి. 1971, డిసెంబర్ 16వ తేదీన 93,000 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ లొంగుబాటును ప్రకటించారు. ఆ మేరకు లొంగుబాటు పత్రంపై సంతకాలు చేశారు. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిసమాప్తం అవగా.. ఘన విజయం సాధించిన భారత్ యుద్ధ క్షేత్రంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. బంగ్లాదేశ్‌కు స్వాంత్రత్యాన్ని సిద్ధించి పెట్టింది.

ప్రపంచ యుద్ధాల్లోనే చారిత్రాత్మకం..

1971, డిసెంబర్ 16న జయకేతనం ఎగురవేసిన భారత్.. దాదాపు 93,000 మంది పశ్చిమ పాకీస్తానీ వాసులను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం సదరు యుద్ధ ఖైదీలందరినీ పాకిస్తాన్‌కు భారత్ తిరిగి అప్పగించేసింది. ఇదే సమయంలో 54 మంది భారత జవాన్లను పాకిస్తాన్ యుద్ధ ఖైదీలుగా బందించింది. వారిని ఇప్పటికీ భారత్‌కు అప్పగించలేదు. పైగా వారు తమ బందీలుగా లేరంటూ ప్రకటిస్తూ వస్తోంది. దీంతో వారి ఉనికి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇదిలాఉంటే. ఒక యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు బహిరంగంగా లొంగిపోవడం ప్రపంచ యుద్ధ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇక 1971 డిసెంబర్ 16 లొంగుబాటు తరువాత తూర్పు పాకిస్తాన్ కాస్తా, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది. ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ దివాస్‌ను నిర్వహిస్తోంది. ఈ యుద్ధంలో పోరాడి అమరులైన జవాన్లను స్మరించుకుంటూ వారి త్యాగాలకు యావత్ భారత్ సెల్యూట్ చేస్తోంది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో